Thursday, March 19, 2026

మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. ఈసారి పాకిస్తాన్ లో?

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 9న జరిగిన భారత్, పాక్ మ్యాచ్ లో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. కానీ ఇప్పుడు కాదు.. ఆ వివరాల్లోకి వెళితే..

మరో మరో ఎనిమిది నెలల్లో మళ్లీ హై ఓల్టేజ్ మ్యాచ్ చూడనున్నారు. భారత్, పాకిస్థాన్ జట్లు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్నాయి. 2025 ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్ ట్రోపీ ఫ్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆరంభ పోరు, ఒక సెమీస్ మ్యాచ్ కరాచీలో.. రెండో సెమీఫైనల్ రావల్పిండిలో జరుగనున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ జట్లు లాహెర్ వేదికగా తలపడనున్నాయి. అయితే.. అందుకు భారత క్రికెట్ బోర్డు అంగీకరించాల్సి ఉంటుంది. మార్చి 9న జరిగే ఫైనల్ ఫైట్ కు కరాచీ వేదిక కానుంది. సరిహద్దు వివాదం కారణంగా భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్ష సిరీస్లు మూలనపడ్డాయి. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే తటస్థ వేదికలపై ఇరుజట్లు తలపడుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్ కు పంపేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. నిరుడు ఆసియా కప్ కోసం కూడా దాయది గడ్డపై టీమిండియా కాలు మోపలేదు. అయితే.. భారత్ అతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్ అడింది. అయితే ఈసారి భారత్ జట్టు పాకిస్థాన్ కు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ ను కూడా లాహోర్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉంది. ఈసారి ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 15 మ్యాచ్ల తర్వాత ఫైనల్ బెర్తులు ఖరారవుతాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News