Tuesday, June 24, 2025

Wiral Video: స్నేహితుల డ్యాన్స్ చూసి పెళ్లికూతురును విడిచిపెట్టి దూకేశాడు..

జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగతుంది. ఆ పెళ్లిని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పెళ్లికి బంధువులు, స్నేహితులు ఎవరున్నా ఆహ్వానిస్తారు. భాజా భజంత్రీలు, అక్షింతల మధ్య పెళ్లి పూర్తయిన తరువాత వింధు భోజనం ఉంటుంది. ఇక సాయంత్రం అసలు కార్యక్రమం ఉంటుంది. అదే భారాత్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కారులో లేదా ఇతర వాహనంలో కూర్చుండబెట్టి వారి ముందు స్నేహితులు, బంధువులు కలిసి డ్యాన్స్ చేస్తూ వీరిని ఊరేగిస్తారు. అయితే ఓ చోట ఈ భారాత్ ను చూసిన పెళ్లి కొడుకు ఏం చేశాడంటే?

ఈరోజుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు భారాత్ లో డ్యాన్ష్ చేయడం కామన్. ఆ మధ్య ఆదిలాబాద్ కు చెందిన ఓ జంట ‘బుల్లెట్టు బండి’ సాంగ్ కు డ్యాన్స్ చేసి ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకుంది. ఆ తరువాత ప్రతీ పెళ్లిలో పెళ్లి కూతురు లేదా పెళ్లికొడుకు డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ పెళ్లి కొడుకు తన స్నేహితులు డ్యాన్స్ చేస్తుండగా చూసి తనకు చేయాలనిపించి. అప్పటి వరకు పెళ్లి కూతురుతో కలిసి ట్రాక్టర్ పై కూర్చొన్న అతడు ఉన్నట్టుండి ఆ బండిపై నుంచి కిందకు దూకేశాడు. వెంటనే తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు.

అయితే వరుడు ఇలా ఒక్కసారి గా ట్రాక్టర్ పై నుంచి దూకడంతో అంతా షాక్ అయ్యారు. ఆ తరువాత అతడికి డ్యాన్స్ పై ఉన్న ఇష్టాన్ని చూసి కూల్ అయ్యారు. అయితే పెళ్లి కొడుకు ఇలా తనను విడిచి పెట్టి దూకినా వధువు కూడా ఏ మాత్రం బాధపడకపోగా సంతోషంగా కనిపించింది. ఈ వీడియోను ‘ఉఫ్ తేరీ అదా’ అనే పేరు మీద ఇన్ స్ట్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షకు పైగా లైక్ లు కొట్టారు. పెళ్లి బారాత్ డ్యాన్స్ అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ ఇలా పెళ్లి కొడుకు డ్యాన్స్ కోసం పెళ్లికూతురును విడిచి ట్రాక్టర్ పై నుంచి దూకడం చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News