ప్రతి ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటికే ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 3:26 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7:57 గంటలకు ముగిసింది. అయితే భారతదేశంలో అది కనిపించలేదు. eclipse on August 12… రెండో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం మామూలే అయినా, భారతదేశంలో ప్రత్యేకంగా చూస్తారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 12న ఏర్పడే సూర్యగ్రహణం భారత్ లో ప్రభావం ఉంటుందా? అంచనాలు బయటకు వస్తున్నాయి.
ఎక్కడ కనిపించనుంది?
నాసా ప్రకారం ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొంత ప్రాంతం మీదుగా ప్రయాణించనుంది. ఈ ప్రాంతాల్లోని గ్రహణ మార్గంలో ఉన్నవారికి చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసే అద్భుత దృశ్యం కనిపిస్తుంది. యూరప్‌లోని చాలా ప్రాంతాలు, ఉత్తర అమెరికా, వాయవ్య ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. అంటే ఆయా ప్రాంతాల్లో సూర్యుడు పూర్తిగా కనుమరుగవకుండా, చంద్రుడు సూర్యుడి డిస్క్‌లో కొంత భాగాన్ని మాత్రమే కప్పేస్తాడు.
భారత్‌లో..?
భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 12 రాత్రి 9:04 గంటల సమయంలో ప్రారంభమై 11:16 గంటల సమయంలో గరిష్ఠ దశకు చేరుకుని, ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 గంటల సమయంలో ముగుస్తుంది. అంటే భారత్ లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదు. దీంతో భారత్ లో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే గ్రహణ సమయంలో మాత్రం ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. దేవాలయాలను మూసివేస్తారు.
అయితే ఈరోజు మరో అద్భుతం జరగనుంది. ఆకాశంలో నక్షత్రాల అద్భుత దృశ్యాన్ని నేరుగా వీక్షించవచ్చు. అమావాస్య కావడంతో ఆకాశంలో ఈ నక్షత్రాలు స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.





