Sunday, August 16, 2026

Wedding Auspicious Times: నేటి నుంచి పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. ఎప్పటి వరకు ఉన్నాయంటే?

Wedding Auspicious Times:తెలుగు రాష్ట్రాల్లో నేట నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వివాహాలు, నిశ్చితార్థాలు, నూతన గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో ఆగస్టు 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, పల్లెల్లో శుభకార్యాల సందడి మరింత పెరగనుంది. ఇప్పటికే పలువురు కుటుంబాలు తమ పిల్లల వివాహాలకు ముహూర్తాలు నిర్ణయించుకుని ఏర్పాట్లు ప్రారంభించాయి.

పంచాంగ నిపుణుల ప్రకారం.. ఆగస్టు నెలలో 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ తేదీల్లో పెళ్లిళ్లు నిర్వహించేందుకు కుటుంబాలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాలు, సెలవు రోజులకు సమీపంలో వచ్చే ముహూర్తాలకు మరింత డిమాండ్ ఏర్పడింది.

శ్రావణ మాసం కొనసాగుతున్న సమయంలో సెప్టెంబర్‌లోనూ 3, 5, 8, 10 తేదీల్లో వివాహాలకు అనుకూలమైన రోజులు ఉన్నట్లు పంచాంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ స్వల్ప వ్యవధి తర్వాత అక్టోబర్ 29 వరకు సరైన వివాహ ముహూర్తాలు లేకపోవచ్చనే కారణంతో అనేక కుటుంబాలు అందుబాటులో ఉన్న శుభదినాల్లోనే వివాహాలు జరిపించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

సన్నరకం ధాన్యానికి రికార్డు ధర.. – insightearth.in – Telugu News Portal

ఈ ఏడాది శ్రావణ మాసం సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో శుభకార్యాలు జరగనున్న నేపథ్యంలో వివాహాలకు సంబంధించిన అన్ని రంగాల్లో వ్యాపారం ఊపందుకుంది. బంగారు ఆభరణాలు, వస్త్రాలు, పూలు, క్యాటరింగ్, డెకరేషన్, ఫొటోగ్రఫీ, మేకప్, వాహనాలు వంటి సేవలకు డిమాండ్ పెరిగింది.

ప్రస్తుత కాలంలో వివాహాలు ఒక్కరోజుతో ముగియడం లేదు. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ, హల్దీ వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వివాహం తర్వాత రిసెప్షన్‌ను కూడా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కుటుంబం రెండు నుంచి మూడు రోజుల పాటు వివాహ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తోంది. దీనివల్ల ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలకు డిమాండ్ మరింత పెరిగింది.

శ్రావణ మాసం ముహూర్తాల నేపథ్యంలో ఇప్పటికే అనేక ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు ముందస్తు బుకింగ్స్‌తో నిండిపోయాయి. ముఖ్యంగా వారాంతాల్లో వచ్చే ముహూర్తాలకు భారీగా డిమాండ్ ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని ప్రముఖ వేదికలకు రెండు నెలల ముందుగానే అడ్వాన్స్‌లు చెల్లించి బుకింగ్స్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

స్వల్ప వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్న నేపథ్యంలో అనుకూలమైన తేదీతో పాటు వేదిక, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, అలంకరణ వంటి సేవలను ఒకేసారి బుక్ చేసుకోవడం కుటుంబాలకు సవాల్‌గా మారింది. అందుకే పలువురు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. మొత్తంగా శ్రావణ మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మరింత ఊపందుకోనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News