జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడినప్పుడు ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రహణాలు కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి ఏడాది రెండుసార్లు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏడాది ఇప్పటికే ఫిబ్రవరిలో సూర్యగ్రహణం ఏర్పడగా.. భారత్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఈసారి కూడా ఆగస్టు 12న వచ్చే సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. అయినా కూడా హిందూ శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం వల్ల కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణంతో కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు ఉంటాయని అంటున్నారు. మరి అలా సూర్యగ్రహణం ఎఫెక్ట్ ఏ రాశులపై ఉందో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశి వారికి సూర్యగ్రహణం ప్రభావం ప్రతికూల పరిస్థితులను చూపుతుంది. మానసికంగా వీరు ఈరోజు బలహీనంగా ఉంటారు. కుటుంబంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల మధ్య విభేదాలు ఉంటాయి. వ్యాపారులకు ప్రత్యర్థులతో బెడద ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం కాదు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను తోటి ఉద్యోగుల ద్వారా పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అయితే గ్రహణం రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత 15 రోజుల పాటు ఇలాగే ఉండే ప్రయత్నం చేయాలి.
సింహరాశి:
సింహరాశిపై సూర్యగ్రహణం ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది. మీరు కొన్ని పనులు మొదలుపెడితే వాటికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏ పని మొదలుపెట్టిన ఇతరుల సహకారం తీసుకోవాలి. స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి
ధనుస్సు రాశి:
ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టుబడును పెట్టిన పెట్టుబడులపై నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీనియర్ల సహకారం పొందుతారు. అయితే అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ప్రయత్నాలు అసలు చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇతరులకు ఇస్తే తిరిగి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
కుంభరాశి:
ఈ రాశి వారికి ఈరోజు మాత్రమే కాకుండా 15 రోజుల తర్వాత కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొని అవకాశం ఉంటుంది. మీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆర్థికంగా కూడా నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే సమయంలో నాణ్యమైనదిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణం లో మార్పుల వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు కలుస్తారు. వీరి ద్వారా బస్తాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలని అనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.
మీన రాశి:
ఈ రాశి వారికి శని దేవుడు వక్ర మార్గంలో ఉండే అవకాశం ఉంది. వీరు ఇలాంటి సమయంలో చేసే పనులు పూర్తికాకపోవచ్చు. అంతేకాకుండా కొందరు వీరి పనులకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంటుంది.. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రతికూల వాతావరణ ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లే వారికి సమస్యలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలకే ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో వీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.





