Sunday, May 3, 2026

విద్యార్థుల ప్రాణాలు కాపాడడానికి రాజస్థాన్లో ఏం చేశారో తెలుసా?(వీడియో)

రాజస్థాన్‌లోని కోటా నగరం… దేశంలోనే అత్యధికంగా IIT-JEE, NEET పరీక్షలకు తయారైనే విద్యార్థుల సంఖ్య ఉన్న ప్రదేశం. ఇక్కడి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం వచ్చిన లక్షలాది మంది విద్యార్థులను హాస్టళ్లు ఆకర్షిస్తున్నాయి. అయితే ఒత్తిడి, పోటీ కారణంగా ఈ హాస్టళ్లో తరచూ ఆత్మ*హ*త్యల వార్తలు వినిపిస్తున్నాయి. 2023-24లో 26 మంది విద్యార్థులు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి గతంలో స్ప్రింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. అయినా ఆగకపోవడంతో ఇలా చేశారు.. అసలు ఏం చేశారంటే?

గతంలో హాస్టల్ యాజమాన్యాలు, ప్రభుత్వం విద్యార్థులు ఉ*రి*వేసుకోకుండా స్ప్రింగ్ ఫ్యాన్‌లు (ఫ్యాన్‌కు కింద నుంచి స్ప్రింగ్‌లు వేలాడేలా ఏర్పాటు) ఏర్పాటు చేశారు. చాలా మంది విద్యార్థులు ఫ్యాన్‌లను తొలగించి లేదా ఇతర మార్గాలు ఎంచుకుని బల*వన్మరణాలు చేసుకున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోవడంతో హాస్టల్ యాజమాన్యాలు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి.

తాజాగా కోటా హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్‌ల చుట్టూ గట్టి ఫెన్సింగ్ (జాలీలా గ్రిల్‌లు) ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఫ్యాన్‌ను పూర్తిగా కవర్ చేసి, ఉ*రి వేసుకుండా అడ్డుకుంటుందని భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఒక్కో ఫ్యాన్ ఖర్చు రూ.2,000 ఉండగా.. ఈ ఫెన్సింగ్ ఖర్చు రూ.5,000 నుంచి 7,000 వరకు ఖర్చవుతోందని అంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఇక్కడ 100కి పైగా హాస్టళ్లలో ఇలా ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆత్మ*హ*త్యల నివారణకు ప్రభుత్వం కూడా మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ సెంటర్లు, 24/7 హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసింది. అయితే, నిపుణులు ఈ ఫిజికల్ చర్యలతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించే కౌన్సెలింగ్‌ను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. కొందరు దీన్ని ప్రశంసిస్తూ ‘చిన్న మార్పు పెద్ద ప్రభావం’ అంటున్నారు. మరికొందరు హాస్టల్స్ ఖర్చు పెరగడంతో ఫీజులు పెంచవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఈ విషయంలో మరిన్ని మార్గదర్శకాలు జారీ చేయవచ్చని అంచనా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News