కరీంనగర్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావ్ ఫూలే 199వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలంగాణ ఫూలే బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ, జిల్లా కార్యదర్శి మేకల నర్సయ్య సంయుక్తంగా పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ సమీపంలోని సంఘం కార్యాలయములో వీరు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వము అధికారికంగా జరిపే జయంతి ఉత్సవాలకు సుబ్బండ వర్గాల ప్రజలు, అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు. మనిషిని కనీసం మనిషిగా చూడని భూస్వాముల పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా వారు చేసిన త్యాగాలను, ధైర్య సాహసాలను నేటి తరానికి వివరిస్తూ, వారిని స్మరించుకుంటూ అన్ని మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాల్ల ఫూలేకు ఘన నివాళి అర్పించాలని అన్నారు.





