కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన కార్పొరేషన్ సీటును కాషాయం పార్టీ కైవసం చేసుకుంది. ఇటీవల ఇక్కడ జరిగిన ఎన్నికల్లో భాగంగ శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుపొంది మేయర్ పదవిని దక్కించుకుంది. దీంతో బీజేపీకి ఇదొక మైలురాయిగా భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోపాగా వేద్దామనిఆలోచిస్తున్న బీజేపీకి కేరళ రాజధాని కార్పొరేషన్ ఎన్నికలు బూస్ట్ ఇచ్చినట్లుగా మారింది.
కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ లో మొత్తం 101 వార్డులు ఉన్నాయి.ఇటీవల వీటికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 50 వార్డులు దక్కాయి. LDF 29, UDF 19 వార్డుల్లో గెలుపొందింది. ఇక్కడ LDF,BJP మధ్య ప్రధాన పోటీ జరిగింది. అయితే బీజేపీ తరుపున వీవీ రాజేశ్ పోటీ చేసి పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. దీంతో ఆ పార్టీ గెలుపొందింది. 2020 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో LDF గెలుపొందగా.. ఆ పార్టీనే అధికారంలో ఉంటూ వస్తోంది. అయితే ఆ సమయంలో బీజేపీ కేవలం 6 స్థానాల్లోనే గెలుపొందింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఏకంగా 50 వార్డుల్లో విజయం సాధించడంతో చరిత్ర సృష్టించినట్లయింది.
బీజేపీ చరిత్రలోనే కేరళలో అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీకి కేవలం ఒక MLA (ఓ రాజగోపాల్) మాత్రమే ఉండగా, ఒక సీనియర్ MP (సురేష్ గోపీ) మాత్రమే 2024లో విజయం సాధించాడు. ఇప్పుడు మేయర్ స్థాయిలో కూడా బీజేపీకి విజయాన్ని తీసుకువచ్చడం పార్టీకి పెద్ద నమ్మకం ను ఇస్తోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

స్థానిక నేత రాజేష్ గురించి..
వీవీ రాజేష్ అనేక సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగ ఎన్నికల్లో ఆయన కోడుంగనూర్ వార్డు నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజధాని కార్పొరేషన్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు.
కేరళ రాజకీయాల్లో మార్పు సంకేతం
ఈ విజయం రాజకీయ బీజేపీకి ప్లస్ కానుంది. ఎన్నో ఏళ్లుగా కేరళలో బీజేపీ పాగా వేయాలని అనుకుంటున్న తరుణంలో ఈ విజయంతో నమ్మకం పెరిగి.. మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కేరళలో పెద్ద వ్యూహాత్మకంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పార్టీకి వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కు ముందే ఇదొక బూస్ట్ గా చూడనున్నారు. తిరువనంతపురం వంటి నగరాల్లో మార్పు రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని అంటున్నారు.





