Thursday, March 19, 2026

అయ్యో.. ఈ బాల గాంధీకి ఎంత కష్టం..(వీడియో)

కొందరు చిన్నారులను చూస్తే మనసు హాయిగా ఉంటుంది. కానీ వారికి చిన్న కష్టం వచ్చినా విలవిలలాడిపోతుంటారు. అయితే కొందరు భిక్షటన కోసం చిన్నారులను అని చూడకుండా వారితో.. వారి స్థాయికి మించిన కష్టం చేయిస్తుంటారు. వారి ద్వారా డబ్బులు పోగేసుకునేవారు ఎందరో ఉన్నారు. సాధారణంగా ఎవరైనా బాలుడిని చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది . అలాంటిది గాంధీ వేషధారణలో ఉన్న పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. అయితే గాంధీ వేషధారణలో ఉన్న ఈ బాలుడిని చూసి అంతా మెచ్చుకుంటున్నారు. కానీ ఆ బాలుడి పడే కష్టం చూసి కన్నీళ్లు కారుస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ బాలుడు పడుతున్నకష్టం వెలకట్టలేదనే చెప్పొచ్చు. భిక్షాటన కోసం శరీరమంతా కలర్ ను పుసుకున్న ఆయన రోడ్డుపై భిక్షాటన చేస్తున్నాడు. కానీ కూర్చున్న చోటే నిద్రపోతూ తల అటూ ఇటూ తిప్పుతూ ఉన్నాడు. ఈ వయసులో ఉన్న పిల్లలకు నిద్ర చాలా అవసరం. కానీ ఆ పిల్లాడు నిద్రలేని రాత్రుళ్లు గడిపినట్లు తెలుస్తోంది. అందుకే పాపం.. కూర్చున్న చోటే నిద్రపోతున్నాడు. ఈ పరిస్థితిని చూసి చలించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. అలాగే ఏపీ మంత్రి లోకేష్ కు షేర్ చేశారు.

ఈ బాలుడి పరిస్థితి చూసి మంత్రి లోకేష్ స్పందించాలి. ఆ బాలుడిని సంరక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ పని చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News