Tuesday, June 24, 2025

ఇలాంటి వెడ్డింగ్ షూట్ ఎక్కడా చూసి ఉండరు.. వీడియో వైరల్..

ఈ మధ్య పెళ్లికి ముందు Wedding Shoots తప్పనిసరిగా మారిపోతున్నాయి. వివాహం కుదిరిన తరువాత పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు కలిసి అందమైన ప్రదేశాల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నాయి. వీటిని పెళ్లి సమయంలో ప్రదర్శిస్తున్నారు. అయితే రాను రాను వెడ్డింగ్ షూట్ లను డిఫరెంట్ గా చేస్తున్నారు. Artificial Intelligence సహాయంతో ఈ లోకంలో లేని వారిని కూడా రప్పిస్తూ ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ పెళ్లి కూతురు డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆమె ఎవరంటే?

నేటి కాలంలో యువతులు..మగవారితో సహా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే కర్ణాటకకు చెందిన ఓ మహిళ బాడీ బిల్డర్ గా ప్రఖ్యాతి పొందారు. ఈమె ఇటీవల పెళ్లి చేసుకునే సమయంలో వెడ్డింగ్ షూట్ పేరుతో ఓ వీడియోను చేసిన దానిని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇందులో ఆమె బాడీ బిల్డర్ గా కనిపిస్తూనే సాంప్రదాయమైన పెళ్లి కూతురు డ్రెస్ ను ధరించారు. ఇందులో కండలు తిరిగిన శరీరంతో ఉన్న ఆమెను చూసి షాక్ అవుతున్నారు.

పెళ్లి కూతురుకు సంబంధించిన ఆభరణాలు ధరించిన ఆమె ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ వీడియోను పురుషోత్తమ్ అనే వ్యక్తి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. సందర్భంగా ఆయన ‘మనస్సు అనేది ప్రతీదీ’ అని క్యాప్షన్ చేశాడు. ఈ వీడియోను శుక్రవారం నాటికి 7 మిలియన్ల మంది వీక్షించారు. ఇంకా ఈ వీడియోనూ అందరూ ఆసక్తి గా చూస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News