మొబైల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ వీడియోలే కనిపిస్తున్నాయి. చాట్ జిపిటి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన సమాచారాన్ని, ఫోటోలను, వీడియోలను ఈ యాప్ క్షణాల్లో అందిస్తుంది. దీంతో ఎలాంటి సర్చ్ లేకుండా కావాల్సిన వాటిని పొందుతున్నారు. అయితే వీటితో కొందరు ఉపాధిని కూడా పొందుతున్నారు. గతంలో యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలంటే కొన్ని ఫోటోలను సేకరించి ఒక వీడియో తయారుచేసి ఆడియో యాడ్ చేసి వీడియోలు పోస్ట్ చేసేవారు. కానీ చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏఐ వీడియోలను తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. కానీ యూట్యూబ్ వీటికి చెక్ పెట్టనుంది..
యూట్యూబ్ జూలై 15 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో భాగంగా యూట్యూబ్లో పోస్ట్ చేసే వీడియోలపై కొన్ని పరిమితులు విధించనుంది. ఇకనుంచి యూట్యూబ్లో పోస్ట్ చేసే అవసరంలేని వీడియోలకు, కాపీ పేస్ట్ వీడియోలకు, AI తో తయారుచేసిన వీడియోలకు మనీ ఇవ్వడాన్ని తగ్గించడం ఉంది. కేవలం ఒరిజినల్ గా కంటెంట్ చేసిన వారిని మాత్రమే ప్రోత్సహిస్తూ.. వారికి అమౌంట్ ఇవ్వనుంది.
కొంతమంది ఎలాంటి కెమెరా లేకుండా కేవలం చార్ట్ జిపిటి యాప్ ద్వారా కంటెంట్, వీడియోలను తయారు చేసి పోస్ట్ చేశారు. కానీ మరికొంతమంది లక్షల రూపాయల ఖర్చుపెట్టి వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఒరిజినల్ కంటెంట్ కంటే ఏఐతో తయారుచేసిన వీడియోలకే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో వర్జినల్ కంటెంట్లు పోస్ట్ చేసే వారి సంఖ్యా తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజల్లో ఏఐ వీడియోల పట్ల ఆసక్తి తగ్గుతుంది. యూట్యూబ్ యాజమాన్యం ఈ క్రమంలో కొత్తగా నిర్ణయం తీసుకోనుంది. అందువల్ల ఇకనుంచి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేవారు ఒరిజినల్ కంటెంట్ ఉంటేనే మనీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే వర్జినల్ కంటెంట్ లో కూడా ప్రజలకు అవసరమయ్యే వీడియోలను మాత్రమే తయారు చేయాలని యూట్యూబ్ తెలుపుతుంది. అవసరంలేని వీడియోలకు డబ్బు ఇవ్వడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుపుతుంది. ఈ నిబంధనలు జూలై 15 నుంచి అమల్లోకి రానున్నాయి.