గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక దేశంలో గ్రామం అభివృద్ధి చెందిందంటే దేశం బాగుపడ్డట్లే అని అనుకుంటారు. భారతదేశంలో దాదాపు 60 శాతానికంటే ఎక్కువ ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పంటలపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో తీవ్రకరువు ఉంటుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి వాతావరణ పరిస్థితులతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. వ్యవసాయం మాత్రమే కాకుండా ఇతర పనులు చేస్తూ ఇక్కడి ప్రజలు తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఎంత ఆదాయం వచ్చినా.. పట్టణాల కంటే తక్కువే అని కొందరు అనుకుంటారు. కానీ దేశంలోని ఓ గ్రామం మాత్రం ఆసియాలోనే అత్యధిక ధనమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా?
గ్రామం అనగానే పూరి గుడిసెలు, నిరుపేదలు కనిపిస్తారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఎవరు చూసినా రిసెస్ట్ పర్సన్ గా కనిపిస్తారు. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాని మాధపర్ గ్రామం ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. ఈ గ్రామం ధనిక గ్రామంగా పేరు తెచ్చుకోవడానికి ఇక్కడ వారు చేసిన బ్యాంకు డిపాజిట్లే కారణం. ఈ గ్రామంలోని ప్రజలు రూ.7 వేల కోట్లు డిపాజిట్లు చేశారు. ఇక్కడి వారి డిపాజిట్లను చూసి 17 బ్యాంకులు వెలిశాయి. ఇక్కడ ఓ పాఠశాల ఉంది. ఇది ట్రస్ట్ ద్వారా నడుస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి.

మధాపర్ గ్రామం ధనికంగా మారడానికి ఇక్కడ ఎన్ఆర్ ఐల డబ్బు పంపడమే కారణం అని తెలుస్తోంది. వివిధ దేశాల్లో స్థిరపడిన వారు తమ ఆదాయంలో పెద్ద మొత్తంలో గ్రామానికి పంపి డిపాజిట్లు చేశారు. ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉంది. విదేశీశాల నుంచి డబ్బు సాయం అందడంతో ఇక్కడ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తారు. రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ గ్రామస్థులంతా కలిసి అభివృద్ధి పనులు చేపడుతారు. మాధాపూర్ గ్రామంలో మొత్తం 20 వేల ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ 1200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుత జనాభా 32,000. వీరు బ్యాంకులో వేసి డిపాజిట్లతో వచ్చిన వడ్డీని గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు.





