Thursday, March 19, 2026

ఓ వైపు మంచు.. మరోవైపు తీవ్రమైన చలిలో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. అసలేం జరిగిందంటే?

ఆసుపత్రిలో బిడ్డకు జన్మినిచ్చిన వారిని చూశాం.. 108 వాహంలో ప్రయాణిస్తుండగా ప్రసవించిన వారి గురించి విన్నాం.. కొన్ని సార్లు రోడ్డుపైనే ప్రసవించిన వారి గురించి తెలుుకున్నాం.. కానీ గడ్డ కట్టే చలిలో వణుకుతున్న వాతావరణంలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. దేశంలోని జమ్మూకాశ్మీర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆడబిడ్డకు ఎంత కష్టం అని కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సరైన వైద్య సౌకర్యాలు లేక ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. అసలు స్టోరీలోకి వెళ్తే..

జమ్మూకాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లోకొన్ని రోజులు మంచు వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇళ్లు, వాహనాలు మంచుతో కప్పబడ్డాయి. రోడ్డుపై కూడా తీవ్రమైన మంచు కురవడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను నిలిపేశారు. అయితే మంచు కురుస్తున్న ప్రాంతాలు ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కానీ ఇక్కడ ఉండే వారికి మాత్రం కష్టాలు తెప్పిస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేక ఇక్కడి వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వైద్య అవసరం ఏర్పడితే నరకం అనుభవిస్తున్నారు. తాజాగా అదే జరిగింది.

జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని మచిల్ వ్యాలీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు నవంబర్ 24న పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే రోడ్డుపై తీవ్రమైన మంచు కురవడంతో ఆమెను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. దీంతో ఆ మహిళ తీవ్రమైన మంచు కురుస్తున్న రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తల్లీ బిడ్డను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కొందరు స్పందిస్తూ ఆయా ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు అందిస్తే ఇలాంటి బాధలు ఉండేవి కావని స్థానికంగా ఉంటున్న ముహమ్మద్ జమాల్ లోన్ ఆరోపించారు.

దీనిపై స్థానిక తహసీల్దార్ సాకిబ్ అహ్మద్ స్పందించారు. మహిళకు తీవ్రమైన నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించారని, తీవ్రమైన మంచు కారణంగానే రోడ్డుపై ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అయితే ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.తీవ్రమైన మంచు కురుస్తున్నా కుప్వారా జిల్లాలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News