భారీ బడ్జెట్ పెట్టి.. ఎన్నో హోప్స్ తో కొన్ని సినిమాలను థియేటర్లకు తీసుకొస్తే పెట్టుబుడులు కూడా రావు. కానీ చడీ చప్పుడు లేకుండా వచ్చే కొన్ని సినిమాల్లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. కంటెంట్ ఉంటే అది ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని సినీ ఇండస్ట్రీలో మరోసారి రుజువైంది. కేవలం రూ. 50 కోట్లతో తీసిన ఓ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు లాభాల బాటలలో తూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన 5 రోజుల్లో రూ.212 కోట్లు వసూలు చేసింది. చివరి రోజు రూ.37 కోట్లు కొల్లగొట్టింది. దీంతో బడా సినిమా తీసే నిర్మాతలు స్త్రీ 2 వసూళ్లు చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? అసలెందుకు లైక్ చేస్తున్నారు?
స్త్రీ మొదటి పార్ట్ కు సీక్వెల్ గా స్త్రీ 2 ఆగస్టు 15న రిలీజ్ అయింది. ఇందులో శ్రద్ధా కపూర్ ప్రధానంగా నటించారు. ఆమెతో పాటు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, ఆపర్ శఖ్తి ఖురానా వివిధ పాత్రల్లో పోషించారు. పార్ట్ 1 లో స్త్రీ పీడ వదిలిపోయిందని చండేరి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఓ దెయ్యం ఆ ఊర్లోని అమ్మాయిలను మాయం చేస్తుంది. ఓసారి నలుగురు స్నేహితుల్లో ఒకరైన విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని ఆ దెయ్యం మాయం చుేస్తుంది. దీంతో పార్ట్ వన్ లో ఉన్న స్త్రీని సాయం చేయమని ఈ నలుగురు కుర్రాళ్లు కోరుతారు. ఆ తరువాత స్త్రీతో కలసి వాళ్లు ఆ ఊరును ఎలా కాపాడుకుంటారు? చివరికి ఏమవుతుంది? అనేదే స్టోరీ..
అయితే ఇది కామన్ స్టోరినే అయినా స్టోరీని మల్చడంలో డైరెక్టర్ అమర్ కౌశిక్ సక్సెస్ అయ్యాడు. రోటీన్ దెయ్యం స్టోరీలా కాకుడా కామెడీ, హరర్ కలిపి ఆసక్తికరంగా తీశాడు. చాలా వరకు కామెడీతో ప్రేక్షకులు ఆనందాన్ని పొందుతారు. ఇదే సమయంలో హరర్ సీన్స్ భయపెడుతూ ఉంటాయి. ఇలా మొత్తంగా సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఇందులో అక్షయ్ కుమార్ గెస్ట్ రోల్ చేశారు. ప్రస్తుత సమయంలో సినిమాల పోటీ లేకపోవడంతో పాటు కామెడీ, హరర్ మూవీ రావడంతో ప్రేక్షకులు ఈ మూవీపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఈ మూవీ త్వరలోనే రూ.500 కోట్ల కబ్బుల్లో చేరుతుందని అంటున్నారు.