‘ఆకాశంలో సగం.. అయినా మాకు అన్యాయం..’ అన్న రోజులు పోయి.. ఆమె అబల కాదు సబల.. అని నిరూపిస్తున్న రోజులివి. పురుషులతో పాటు మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. ఒక రాష్ట్రపతిగా.. ఒక ఆర్థికశాఖ మంత్రిగా.. దేశ రాజధాని అయిన ఢిల్లీకి ముఖ్యమంత్రిగా.. అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేసే మహిళామణిగా.. ఇలా ఎన్నో రంగాల్లో నేటి కాలంలో మహిళలు రాణిస్తున్నారు. అయినా ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. అయితే మహిళలకు తమ హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తోటి చెల్లికి.. కన్న తల్లికి.. కట్టుకున్న భార్యకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలపాలని చాలా మందికి ఉంటుంది. మరివారికిఈ అందమైన కోటేషన్స్ తో మహిళా శుభాకాంక్షలు తెలపండి..
స్త్రీ లేకపోతే సృష్టి లేదు..స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు.. అసలు స్త్రీ లేకపోతే జీవితమే లేదు… మనుషులను కంటికి కాపాడే మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
అమ్మను పూజించు.. సోదరిని దీవించు.. భార్యను ప్రేమించు..మొత్తంగా మహిళలను గౌరవించు…మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
ఆడపిల్లనంటూ దిగులు చెందకు.. ఆడ పులిలా మారి ఈ లోకానికి నీ వెంటో నిరూపించు.. తోటి మహిళల్లో వెలుగులు నింపు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
అమ్మగా.. సోదరిగా.. అమ్మమ్మగా.. జీవితాంతం తోడే ఉండే భార్యగా.. నిత్యం మన వెంటే ఉండే మాతృమూర్తులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
సృష్టికి ఒక కానుక ఆమె..
ఓ మధుర భావన ఆమె..
శక్తి స్వరూపం ఆమె..
ప్రేరణ ఆమె.. లాలన ఆమె..
ఆమె లేకుంటే అంతా శూన్యమే..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
అంతులేని సహనం..
ఏ కష్టాన్నయినా గుండెలో దాచుకునే ఔదార్యం..
అర్థం చేసుకునే నేర్పు..
అదే ఆమెలోని అందం..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
కార్యేసు దాసి..
కరణేషు మంత్రి..
భోజ్యేసు మాత..
సమస్తలోకం నీవే తల్లి..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
మహిళలు ఎక్కడ గౌరవం పొందుతారో..
అక్కడ దేవతలు ఉంటారు..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
ఆకాశమే హద్దుగా..
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న..
మహిళలలకు..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..
మహిళలను మెచ్చుకోవడం అంటే..
మన గౌరవాన్ని మనం పెంచుకోవడమే..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..