Tuesday, June 24, 2025

Wiral Video: లండన్ వీధుల్లో లుంగీ కట్టి యువతి హల్ చల్..: వీడియో వైరల్

దక్షిణ భారతదేశంలో లుంగీ ధరించడం సాంప్రదాయ, ఫ్యాషన్ కూడా. లుంగీ వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. వేసవి కాలంలో లుంగీ ధరించడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో లుంగీ ధరించే ఉంటారు. ఇతర ట్రూజర్స్ వేసుకోవడానికి ఇష్టపడరు. అయితే లుంగీని ఎక్కువగా మగవారు మాత్రమే ధరిస్తారు. ఆడవారు ధరించరు. కానీ ఓ యువతి లుంగీ కున్న గొప్పదనాన్ని విదేశీ వీధుల్లో చాటి చెప్పింది. తాను లుంగీ కట్టుకున్న ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారండం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

తమిళనాడులు లుంగీ సాంప్రదాయం ఎక్కువ. ఇక్కడి మొగవారు దాదాపు లుంగీ మీదనే కనిపిస్తారు. రాజకీయ నాయకులు సైతం ఎక్కువగా లుంగీమీదనే దూర ప్రయాణాలు చేస్తారు. ఇదే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాలెరీ లండన్ లో నివసిస్తోంది. అయితే లేటేస్ట్ గా ఈము లుంగీ కట్టుకొని చూపించి దాని గొపదనాన్ని వివరించారు. లుంగీపై ఓ టీషర్ట్ ధరించి అచ్చం తమిళనాడులో ఉన్న మొగవాళ్లలాగే నడుస్తూ లుంగీ సాంప్రదాయం గురించి చెప్పారు.

ఈ వీడియోను వాలెరీ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పంచుకున్నారు. నేటి యువతులు ఫ్యాషన్ వైపు వెళ్తుండగా మన సాంప్రదాయం మరువొద్దు అన్నట్లుగా ఈ వీడియో తీయడంతో భారతీయులు ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. అంతేకాకుండా విదేశీ గడ్డపై భారత్ గొప్పదనాన్ని చెబుతున్న ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక లుంగీ చరిత్రలోకి వెళితే.. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ దేశాల్లోనూ ఈ వస్త్రాన్ని ధరిస్తారు. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లుంగీ తప్పనిసరిగా వాడుతూ ఉంటారు.

కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ ఎవరో తెలుసా?

https://insightearth.in/do-you-know-who-was-the-first-telugu-woman-to-be-a-california-superior-court-judge/

ప్రస్తుతం మనదేశంలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో లుంగీని ఎక్కువగా ధరిస్తున్నారు. అయితే కొందరు నైట్ ప్యాంట్, షార్ట్స్ వేసుకుంటున్నా.. లుంగీలో ఉన్న సుఖం ఎందులో ఉండదని కొందరు అంటుంటారు. అంతేకాకుండా లుంగీ గొప్పదనాన్ని గురించి వివరిస్తూ ఇప్పటికే ‘లుంగీ డాన్స్’ అనే సాంగ్ కూడా వచ్చింది. ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలియంది కాదు. మరి విదేశీ గడ్డపై ఓ యువతి లుంగీ గొప్పదనాన్ని వివరించినప్పుడు మనదేశంలో ఉన్న వారు దీనిని ధరించడం భావ్యమే కదా..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News