మైక్రోసాప్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విమాన సర్వీసులు చాలా వరకు నిలిచిపోయాయి. మైక్రోసాప్ట్ విండోస్ లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఎర్రర్ వస్తుంంది. ఇది ల్యాప్ టాప్ పై కూడా కనిపిస్తుంది. ఇది వచ్చిన వెంటనే షట్ డౌన్ లేదా రీస్టాట్ అవుతోంది. దీంతో విండోస్ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే విండోస్ ఎర్రర్ కారణంగా కొన్ని ముఖ్యమైన సేవలు నిలిచిపోయాయి. అవేంటేంటే?
భారత్ లోని అనేక విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఎయిర్ పోర్టుల్లో చెకింగ్, బుకింగ్ సర్వీసులు కొనసాగడం లేదు. ఆస్ట్రేలియాలోని కొన్ని వార్త సంస్థలకు అంతరాయం ఏర్పడుతోంది. వూల్ వర్త్స్ అనే సూపర్ మార్కెట్ సేవలు విండోస్ పైనే ఆధారపడుతాయి. దీంతో ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. అమెరికాలోని 911 అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి.
@IndiGo6E Stuck at Dubai airport for over an hour now. Check-in servers down, no movement in sight. Frustrating start to travel. @DubaiAirports any updates? #DubaiAirport #TravelTroubles pic.twitter.com/fsU6XesWsD
— Sameen (@MarketWizarddd) July 19, 2024