హిందూ శాస్త్రం ప్రకారం భారత్ లో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. అశ్వయుజ మాసంలో వచ్చే ఈ దీపావళిని మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. ఇంటిల్లి పాదితో పాటు వాణిజ్య సముదాయాలను పరిశుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మూడురోజుల పండుగలో మొదటి రోజు ధన్ త్రయోదశి పండుగను నిర్వహిస్తారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని ధన్వంతరి ప్రసాదించింది. సమస్త ప్రజలకు రోగ నివారణ కోసం శ్రీ మహావిష్ణువు ఈ అవతారంలో ఆవిర్భవించాడని చరిత్ర చెబుతోంది. ఈ సందర్భంగా ధన్వంతరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో మహా లక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ ‘బలి దీపం’ పెడుతారు. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే ఈ బలిదీపం కథ ఏంటి?
జీవితం సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఇందుకోసం మహాలక్ష్మీ అనుగ్రహం పొందడానికి అనేక పూజలు చేస్తారు. అయితే సాధారణ రోజుల్లో చేసే పూజల కన్నా ప్రత్యేకమైన రోజుల్లో చేసే పూజలు అధిక ఫలితాన్ని ఇస్తాయి. దీపావళి సందర్భంగా మహాలక్ష్మీ అమ్మవారి ప్రతి ఇంటి గడప తొక్కుతుందని అంటారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆహ్వానించడానికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. వీటిలో ‘బలిదీపం’ ఒకటి. దీపావళి సందర్భంగా బలిదీపం పెట్టడం మృత్యుదోశాలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఈ బలిదీపం ఎలా పెట్టాలంటే?
బలిదీపం ను ధన్ త్రయోదశి రోజున పెడుతారు. దీపావళి ఒకరోజు కంటే ముందు ధన్ త్రయోదశిని జరుపుకుంటారు. 2024 ఏడాదిలో అక్టోబర్ 29న ధన్ త్రయోదశిని జరుపుకుంటున్నారు. అంటే ఈరోజున బలిదీపం పెట్టాల్సి ఉంటుంది. బలిదీపం పెట్టాలనుకునేవారు గోధుమ పిండితో కలిగిన దీపంను తయారు చేయాలి. ఈ దీపం తయారీలో గోధుమ పిండిలో బెల్లం తురుము, పచ్చి ఆవు పాలు కలపాలి. ధన్ త్రయోదశి రోజు సాయంత్రి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ దీపాన్ని వెలిగించాలి. దీని వొత్తులు దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించడం చాలా మంచిది అని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. బలిదీపం ఎక్కడైతే ఉంచారో.. అక్కడ ఒకే దీపం కాకుండా దీనితో పాటు తమలాపాకు, కొద్దిగా బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.
మరుసటి రోజు ఈ దీపాన్ని ఎవరూ కాలితో తొక్కకుండా జాగ్రత్త పడాలి. ఉదయం స్నానం చేసిన తరువాత ఈ దీపాన్ని చెట్లలో లేదా నీటిలో వేయాలి. ‘బలిదీపం’నే యమ దీపం అనికూడా అంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల మృత్యుదోషాల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.





