డబ్బు సంపాదించడమే కాదు.. అవసరాలకు తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూ డబ్బును పొదుపు చేయాలి. కొందరు డబ్బు బాగా ఖర్చు పెడుతారు.. మరికొందరు పిసినారితనం చేస్తారు. కానీ ఎవరికి వారు తమ అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. ఖర్చులు పోగా కొంత డబ్బును సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్ లో అత్యవసరం ఏర్పడినప్పుడు కష్టం అవుతుంది.
అమెరికాలో పేదవారు సినిమాలు వీడియో గేమ్స్ మ్యూజిక్ ఇలాంటి వాటి మీద కంటే కూడా లాటరీ టికెట్స్ పైన ఎక్కువ ఖర్చు పెడతారు. పేదవారు ఇలా చేయడం చూసి ధనవంతులు తప్పుగా అనుకుంటారు. ఎందుకు వీళ్లంతా డబ్బుని నాశనం చేసుకుంటున్నారు అని. లాటరీ టికెట్ల మీద డబ్బు ఖర్చు పెట్టడం తప్పే కావచ్చు. కానీ ఈ లాటరీ టికెట్ వాళ్ల జీవితంలోకి ఏదైనా లక్కు తీసుకొస్తుందేమో అని గట్టిగా నమ్ముతారు. ఇది వినడానికి అంత మంచిగా అనిపించకపోయినా వాళ్లకు ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళు అలా చేస్తారు. అలాగే అక్కడ ఉండే ధనవంతులు చేసే ఖర్చు చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఎక్కువ ఖర్చు ఎందుకు చేస్తున్నారు? అని అనుకుంటారు.
పేదవారిని చూసి విమర్శించకుండా.. ధనవంతుల ను చూసి అసూయపడకుండా మన అవసరాలు ఎలా ఉన్నాయి? వాటికి ఎంత ఖర్చు చేసుకోవాలి?అనే ప్రణాళిక వేసుకోవాలి. డబ్బు విషయాల్లో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావారి పరిస్థితిలే వాళ్లకి కారణం అవుతాయి. కాబట్టి ఎవరి నిర్ణయాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. లాటరీ టికెట్స్ కొనడం మంచిది అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఈ డబ్బుని సరైన విధానంలో ఉపయోగించకపోవడం వల్ల అప్పులు పాలవుతారు. అలాగే కొంతమంది ఎంత డబ్బు ఖర్చుపెట్టినా మళ్లీ అంత డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. డబ్బు ఒక్కొక్కరి విషయాల్లో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. మన జీవితాల్లో జరిగే ఎన్నో ఎక్స్పీరియన్స్ వల్ల అందరికీ ఈ డబ్బు మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనాప్పటికీ ప్రతి ఒక్కరికి డబ్బు అనేది కావాల్సిందే. రాత్రి పగలు అనే తేడా లేకుండా మన అవసరాలు తీర్చుకోవడం కోసం కష్టపడుతూనే ఉంటాం.