మనుషులు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో రకాలుగా పనులు చేస్తూ ఉంటారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు తమ విధుల్లో మునిగిపోతూ ఉంటారు. అయితే చాలామంది ప్రస్తుత కాలంలో ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తిగా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రతి విషయంలో అలసటగా కనిపిస్తున్నారు. కొందరు చిన్నచిన్న సమస్యలకే రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు అన్నిటికీ కారణం విటమిన్ డి అని కొందరు వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని ఆ తర్వాత అనేక రోగాలు దరి చేరుతాయని వారు పేర్కొంటున్నారు. అయితే విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా విటమిన్ పొందాలి?
వాస్తవానికి విటమిన్ డి ఉచితంగానే లభిస్తుంది. ఇది సూర్యరశ్మి నుంచే శరీరంలోకి వెళ్లి విటమిన్ గా మారుతుంది. అయితే చాలామంది ఉదయం 8 గంటల లోపు ఎండలో ఉండడం వల్ల విటమిన్ డి వస్తుందని సూర్యరశ్మిలో ఉంటున్నారు. కానీ మధ్యాహ్నం ఎండలో కూడా విటమిన్ టి లభిస్తుంది. చాలామంది ఉష్ణోగ్రతకు భయపడి ఇంటిలో నుంచి బయటకు వెళ్లడం లేదు. ఎండవేడికి తట్టుకోలేక గడప దాటడం లేదు. ఇలా దాటకపోవడంతో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు.
గుండె జబ్బుల నుంచి.. మోకాళ్ళ నొప్పుల వరకు విటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది. అయితే విటమిన్ డి ని పొందాలంటే ప్రత్యేకంగా ఎండలో నడవాల్సిన అవసరం లేదు. కానీ చిన్న చిన్న పనుల కోసం ఎండలో నడవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతకు భయపడి ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలి. ఎండ వేడిలో మందంగా ఉండే దుస్తులు కాకుండా పలుచటి దుస్తులను ధరించాలి. ఇలా సూర్యరష్మికి అలవాటు పడడం ద్వారా అలసట తగ్గుతుంది. అలాగే విటమిన్ డి శరీరంలోకి వెళ్తుంది. దీని ద్వారా అనేక రోగాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.
నేటి కాలంలో చాలామంది ఏసీలకు అలవాటు పడిపోయారు.. ముఖ్యంగా పిల్లలను ప్రతి విషయంలో చల్లటి ప్రదేశంలో ఉంచుతున్నారు. ఇలా ఉండడం వల్ల ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సూర్య రశ్మిని పిల్లలకు అలవాటు చేసే ప్రయత్నం చేయాలని అంటున్నారు. అంతేకాకుండా సూర్యలక్ష్మి లో ఉండే అవకాశం లేనివారు కొన్ని విటమిన్ డి లభించే ఆహార పదార్థాలను తినాలని అంటున్నారు. కోడిగుడ్లు, పాలు, చేపల ద్వారా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల వీటిని తరచూ తింటూ ఉండాలి. అలాగే సోయా లేదా బాదంపాలు, ఆరెంజ్ జ్యూస్, గ్రేట్ వంటివి తింటూ ఉండడం వల్ల విటమిన్ డి లభించే అవకాశం ఉంది.
విటమిన్ డి లోపం వల్ల మొదట్లో చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. అందువల్ల అలసట లేదా ఒళ్ళు నొప్పులు, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు వెంటనే విటమిన్ డి లభించే పదార్థాలను తినడం లేదా సూర్యరష్మికి ఉండే ప్రయత్నం చేయాలి.