సినీ లెజండరీ యాక్టర్ కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూయడంతో ఆయన గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు మన మధ్యే ఉన్నట్లు అనిపించిన యాక్టర్ అని కొందరు కొనియాడుతున్నారు. అయితే మిగతా నటుల్లాగే.. కోట శ్రీనివాసరావు సైతం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇందులో ఆయన ఇమడలేకపోయారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా రాజకీయాలంటే ఇష్టం లేదని చెప్పారు. అందుకు కారణం ఏంటంటే?
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తెలుగులో ఎన్టీరామారావును స్ఫూర్తిగా తీసుకొని ఆయన వెంట మహా నటులు సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే చాలా మంది ఎన్టీఆర్ ను అనుసరించి తెలుగుదేశం పార్టీలో చేరగా కోట శ్రీనివాస రావు మాత్రం అందుకు భిన్నంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటికే బీజేపీలో ఉన్న అటల్ బీహార్ వాజ్ పేయి పై ఉన్న అభిమానంతో ఆయన ఆ పార్టీలో చేరారు. 1990లో ఈ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ సమయంలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ కు కంచుకోట అయిన విజయవాడ తూర్పు నియోజకవర్గం కోట శ్రీనివాసరావు అడుగుపెట్టడంతో బీజేపీ వశం అయింది.
కోట శ్రీనివాస్ నటించిన తొలి, చివరి చిత్రాలు ఇవే.. – insightearth.in – Telugu News Portal
రాజకీయాల్లో ఎన్నో సేవలు చేసిన ఆయన ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ నిర్వహించే సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అయితే కొన్నాళ్ల తరువాత రాజకీయాలపై అనాసక్తి ఏర్పడి దూరంగా ఉన్నారు. ఆ తరువాత తిరిగి సినిమాల్లో నటించిన తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకసారి జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘రాజకీయాల్లోకి వచ్చారు. కానీ దానిని నటనలా తీర్చిదిద్దలేకపోయాను’ అని అన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో నైతికత తక్కువ అవుతోందని అభిప్రాయపడ్డారు.