ఒక్కో సందర్భంలో జాతులు వేరైనా కొన్ని జంతువులు కలిసి ఉంటాయి. కానీ విషం చిమ్మే జంతువులు, పక్షులు, క్షీరదాలు ఎప్పటికీ కలవవు. ఇవి వాటి ఆత్మ రక్షణ కోసం ఎదుటివారిని పగతోనే చూస్తాయి. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు దాడులనే నమ్ముకుంటాయి. అడవికి మృగరాజు అయిన సింహం అంటే వేటికైనా భయమే. అయినా దాని నుంచి రక్షించుకునేందుకు సాధ్యమైనంత వరకు పోరాడాలని మిగతా జంతువులు చూస్తుంటాయి. ఇలాగే ఓ పక్షి, Blak Mamba అనే పాము తో పాటు సింహం అనే మూడు జాతుల మధ్య యుద్ధం జరిగింది. వీటిలో ఏది గెలిచిందంటే?
ఒక అడవిలో ఆడ సింహం ఒక దృశ్యాన్ని చూసింది. అక్కడ ఒక Blak Mamba ను గద్ద తన రెక్కలను ఉన్న గోర్లతో గట్టిగా పట్టుకొని ఉంది. గద్ద నుంచి విడిపించుకోవడానికి Blak Mamba ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ పామును ఎలాగైనా తినేయాలని గద్ద పట్టుకొని ఉంది. కానీ ఆడ సింహం మాత్రం ఈ రెండింటిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో పాము మాత్రం సింహం దాడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ క్రమంలో గద్ద Blak Mamba ను విడిచిపెడుతుంది. ఆ తరువాత గద్ద సైతం సింహంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.ఇక్కడ గద్ద సింహంపై గెలవలేదు. కానీ తన వంతు పోరాటం చేయడానికి ప్రయత్నించింది. అటుBlak Mamba సైతం తన ప్రాణాల రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి పాము, గద్ద పౌరుషాలను చూసి సింహం వెనుకడుగు వేస్తుంది. అంటే ఇక్కడ ధైర్యం గెలిచిందని అనుకోవాలి.
అంటే ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సాధ్యమైనంత వరకు పోరాడాలి. చివరివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఎదుటివారి ధైర్యాన్ని చూసి ప్రత్యర్థులు పోరాటం నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది చూడండి..





