ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పదం Ghibli Art. ఒక వ్యక్తి లేదా తాను స్నేహితులతో, కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను కార్టూన్ స్టైల్లో మార్చుకోవాలంటే గిబ్లి ఆర్ట్ లోకి వెళ్లి మార్చుకోవచ్చు. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండే సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు తమ ఫొటోలను గిబ్లి ఆర్ట్ గా మార్చుకుంటున్నారు. అయితే ఈ Ghibli Art ను ఎవరు కనిపెట్టారు? ఇది ఎక్కడ ప్రారంభం అయింది? ఆ వివరాలు మీకోసం..
Ghibli Art ను మొదటగా కనిపెట్టింది Hayao Miyazaki. ఈయన జపాన్ లోని టోక్యోలో జనవరి 5, 1941లో జన్మించారు. ఆర్టిస్టు మాత్రమే కాకుండా ఒక సినిమా డైరెక్టర్. జపాన్ లో ‘మంగ’ అనే బొమ్మలు సినిమాలు తీసే ఆయన మొదటి సినిమా లుపిన్ 3: ది కాజిల్ ఆఫ్ కాగ్లియోస్ట్రో. ఇది 1979లో విడదలయింది. ఆయన తీసిన ‘నౌసికా ఆఫ్ ది వ్యాలీ ఆఫ్ ది విండ్ (1984)తో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ తరువాత 1985లో జపాన్ లోని ముగ్గురు కళాకారులు ఓ స్టోరీ చెప్పడం ద్వారా ఈయన ‘Ghibli’స్టూడియోను ప్రారంభించారు. అయితే సినీ పరిశ్రమ కంప్యూటర్ యుగంలోకి మారిన తరువాతయ ఆయన చేతితోనే యానిమేషన్ బొమ్మలను త తయారు చేసేవాడు. తన బొమ్మల ద్వారానే సినిమా స్టోరీని చెప్పేవాడు.

సినీ పరిశ్రమ నుంచి Hayao Miyazaki పదవీ విరమణ పొందిన తరువాత యానిమేటేడ్ ఫిలిం ‘ది బాయ్ అండ్ ది హెరాన్’ నిర్మించాడు. ఇది విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత ఈయన ఉత్తమ యానిమేటేడ్ ఫీచర్ అవార్డును అందుకున్నాడు. 2024లో మియాజాకి ప్రతిష్టాత్మక మాగ్సెసె అవార్డును అందుకున్నాడు. 2003లో తీసిని Spirited A way అనే మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే 2013లో ‘ది విండ్ రైజర్స్’ అనే సినిమాలో 4 సెకన్ల సీన్ ను గిబ్లిగా యానిమేట్ చేయడానికి ఒక సంవత్సరం 4 నెలల సమయం పట్టింది.
Artificail Intelligence(AI)అందుబాటులోకి వచ్చిన తరువాత గిబ్లి నేటి తరానికి కొత్తగా అనిపించింది. దీంతో తమ ఫొటోలను గిబ్లిగా మార్చుకొని అప్లోడ్ చేస్తున్నారు. కానీ Hayao Miyazakiతో సంబంధం లేకుండా దీనిని వాడుకోవడంతో ఆయన ఎంతో బాధపడ్డారు. ఆర్ట్ అనేది హ్యుమన్ మైండ్ సెట్ నుంచి వస్తుంది.. అంటూ సంచలన కామెంట్ చేశారు.