Tuesday, March 3, 2026

ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎయిర్ పోర్టు ఏదీ? ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి?

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని దేశాలు పూర్తిగా ఎయిర్ లైన్ ను మూసివేశారు. ఫిబ్రవరి 27, 2026 నుంచి అన్ని ఫ్లైట్ ఆపరేషన్లు సస్పెండ్ చేశారు. మార్చి 2 మధ్యాహ్నం (UAE సమయం 3 PM) ఫ్లైట్లు నిలిచిపోయే అవకాశం ఉంది. వీటిలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిగా మూతపడి ఉంది. . ఇరాన్ ప్రతీకార దాడులు, గల్ఫ్ ఎయిర్‌స్పేస్ మూతల వల్ల 19వేల కంటే ఎక్కువగా ఫ్లైట్లు ఆలస్యమయ్యాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారతీయ ఎయిర్‌లైన్స్ 700 కంటే ఎక్కువగా ఫ్లైట్లు ఆగిపోయాయి. దీంతో వేలాది ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఆగిపోయారు. ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు సైతం దుబాయ్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎయిర్ పోర్టు అయిన DXBకి ఈ పరిస్థితి రావడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఎయిర్ పోర్టు ప్రపంచంలోనే నెంబర్ వన్ సాధించడానికి కారణం ఏంటీ? దీని చరిత్ర ఏంటీ? ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి?

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 2026 జనవరిలో అట్లాంటా Hartsfield-Jacksonను మించి ప్రపంచంలో మొదటి స్థానం సాధించింది, మొత్తం సీట్ కెపాసిటీలో 5.5 మిలియన్ సీట్లతో. ఇది 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ ప్యాసింజర్లలో No1గా ఉండి, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ద్వారా గ్లోబల్ కనెక్టివిటీ పెంచుకుంది. ఆసియా, యూరప్, అమెరికా మధ్య మధ్యవర్తి హబ్‌గా ఎమిరేట్స్ A380, B777లతో 265+ డెస్టినేషన్లకు కనెక్ట్యి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ పెరిగింది. 2025లో 62.4 మిలియన్ సీట్లు, టూరిజం, బిజినెస్ పెరుగుదలతో ఒకే రోజు (జనవరి 3) 324,000 ప్యాసింజర్లు ఇక్కడ ఆగారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చరిత్ర 1937లో ప్రారంభమైంది, బ్రిటిష్ ఇంపీరియల్ ఎయిర్‌వేస్ ఫ్లైయింగ్ బోట్ బేస్‌తో. 1959లో షేక్ రషీద్ బిన్ సఈద్ ఆల్ మక్తూమ్ ఆదేశంతో నిర్మాణం మొదలై 1960 సెప్టెంబర్ 30న ఒక చిన్న టెర్మినల్, 1,800 మీ. రన్‌వే (కంపాక్టెడ్ సాండ్)తో టాప్ చేశారు.

1965లో మొదటి ఆస్ఫాల్ట్ రన్‌వే, DC-3 సైజు విమానాలు హ్యాండిల్ చేసింది.
​1970 లో మూడు అంతస్తుల టెర్మినల్, మధ్యప్రాచ్యంలో మొదటి ATC టవర్, B747లకు అనుకూలం.
​1980-90 మధ్య ప్యాసింజర్ ట్రాఫిక్ 4.3 మిలియన్ (1988) నుంచి 9.7 మిలియన్ (1998)కు పెరిగింది.
​2000 సంవత్సరంలో టెర్మినల్-2 (1998), కాన్కోర్స్ C (2000, 23 మిలియన్ కెపాసిటీ), ఎమిరేట్స్ గ్రోత్‌తో.
​2008లో టెర్మినల్-3 (ఎమిరేట్స్‌కు, ప్రపంచంలో అతిపెద్ద) ఓపెన్, 60 మిలియన్ కెపాసిటీ.
​2013లో కాన్కోర్స్ A (A380కు మొదటి), 2016లో కాన్కోర్స్ D.

ఇండియా నుంచి దుబాయ్ కి రద్దయిన ఫైట్లు ఇవే..

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా ఇండియా నుండి దుబాయ్ ఎయిర్‌పోర్టు కు అన్ని ఫ్లైట్లు పూర్తిగా రద్దు అయ్యాయి. ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఫ్లైడుబాయ్, స్పైస్‌జెట్ వంటి ఎయిర్‌లైన్స్ 700 పైగా ఫ్లైట్లు ఆపేశాయి, DXB మార్చి 2 మధ్యాహ్నం (UAE 3 PM) వరకు ఉండే అవకాశం ఉంది.

దిల్లీ (DEL): ఎయిర్ ఇండియా (AI929, AI995), ఎమిరేట్స్ 28 ఫ్లైట్లు వీక్లీ రద్దు.
హైదరాబాద్ (HYD): ఎయిర్ ఇండియా AI951, ఎమిరేట్స్ ఫ్లైట్లు ఆగిపోయాయి.
ఇతర నగరాలు: బెంగళూరు, ముంబై, చెన్నై నుండి IndiGo, Air India Express రద్దులు.
​సాధారణంగా రోజుకు 100+ ఫ్లైట్లు ఉండేవి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News