ఒక మనిషి బతకడానికి ఇప్పటి కాలంలో డబ్బు కచ్చితంగా అవసరం. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు లేకపోతే జీవితం సాగదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు.. ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి.. రోజుకు ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది. అది పెట్రోల్ రూపంలో కావచ్చు.. లేక బస్సు చార్జీల రూపంలో కావచ్చు.. లేదా ఆహారం కోసం ఖర్చులు ఉండవచ్చు. ఇవే కాకుండా మిగతా అవసరాల కోసం కచ్చితంగా డబ్బు కావాలి. జీవితంలో డబ్బు ముఖ్యం కాదు అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి డబ్బు అసలు ఎలా పుట్టింది? ధనం ప్రారంభంలో ఎలా ఉండేది? నాణేల రూపంలో ఉండే డబ్బు కాగితపు డబ్బుగా ఇలా మారింది..? అలాగే ప్రపంచంలో డాలర్ మాత్రమే ఎక్కువ విలువను ఎందుకు కలిగి ఉంది? ఆ వివరాల కోసం ఈ స్టోరీ చదవండి..
కొన్ని అంచనాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 36.8 రిలియన్ డబ్బు ఉందని తెలుస్తుంది. ఇది కనిపించే డబ్బు మాత్రమే. కనిపించని డబ్బు ఇంకా ఎంతో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఉపయోగస్తున్న. ద్రవ్య విధానం ఒకప్పుడు నాణేల రూపంలో ఉండేది. ఇది 5000 సంవత్సరాల కిందట.. అంటే 1500 B.C. మెసపటోమియా అనే ప్రాంతంలో డబ్బు ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ఇరాక్ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు తమ అవసరాలు తీర్చుకోవడానికి వాస్తు మార్పిడి చేసేవారు. అంటే ఆహారం కోసం జంతువులను వేటాడేవారు. కొందరు వస్తువులను సేకరించేవారు. ఇలా వస్తువులను అందించి ఆహారాన్ని తీసుకునేవారు. అయితే వస్తు మార్పిడి తో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక వ్యక్తి దగ్గర కొన్ని వస్తువులు ఎక్కువగా ఉండి.. మరో వ్యక్తి దగ్గర అవసరం లేని వస్తువులు ఉండేవి. దీంతో ఎవరికి కావాల్సిన వస్తువులు వారికి దొరికేవి కావు. దీంతో ఏదైనా విలువైన వస్తువును ఏర్పాటు చేసి దానిని ఇచ్చి వస్తువును తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నాణేలను ప్రారంభించారు.
వస్తువుల కంటే విలువైనది బంగారమని గుర్తించారు. 600 B.C. లో వీటిని గుర్తించారు. అయితే బంగారం అన్ని చోట్ల లభించేది కాదు. దీంతో దీనికి ఇతర లోహాన్ని కలిపి నాణేలను తయారు చేసేవారు. ఈ నాణేలను గుర్తుపట్టే విధంగా ఏ రాజ్యం వారు తయారు చేసేవారో.. ఆ రాజు బొమ్మ ఉండేది. ఇలా మొట్ట మొదటగా ‘లైబీఎన్ స్టార్ట్’ అనే నాణేం ను తయారు చేశారు. ఇది గ్రీకుల కాలం నాటికంటే ముందు నాణెం అని చెబుతారు. అయితే ఈ నాణాలను అందరూ తయారు చేయడం ప్రారంభించారు. దీంతో వీటిని కొందరు దాచుకుంటే వాటిని దొంగిలించేవారు. మరోవైపు ఇవి బరువుగా ఉండటంతో తేలికపాటి నాణేలను తయారు చేయాలని నిర్ణయించారు.
1279 చైనాలోని మంగోల్ లో షాంగ్ వంశం పేపర్ మనీని మొట్టమొదటిసారిగా తయారు చేసింది. దీనిని జియోజి అని పిలిచేవారు. దీనిపై I.O.U అని రాసి ఉండేది. I.O.U అంటే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని అర్థం. ఆ తర్వాత ఈ పేపర్ మనీ మిగతా దేశాలకు పాకింది. 1792 లో డాలర్ అనే కరెన్సీ నోటు అధికారిక మనీ గా నిర్ణయించారు. ఆ తర్వాత బ్రిటన్ దేశం పేపర్ మనీ ని తయారు చేయడం మొదలుపెట్టింది. అయితే ఈ దేశం గోల్డ్ స్టాండర్డ్ తో పేపర్ మనీని తయారు చేసింది. దీన్ని చూసిన అమెరికా సైతం కరెన్సీ తన మనీకి పటిష్టం తీసుకురావాలని అనుకుంది.
ఇదిలా ఉండగా 1944లో 44 దేశాల ప్రతినిధులు అంతర్జాతీయ కరెన్సీలపై సమావేశం అయ్యారు. ఇక్కడ అమెరికా, బ్రిటన్ దేశాల మధ్య కరెన్సీ పెత్తనం గురించి వివాదాలు తలెత్తాయి. అయితే ఇదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరగడంతో చాలా దేశాల వద్ద అప్పటికే ఉన్న బంగారం నిల్వలు తగ్గిపోయాయి. దీంతో అమెరికా వద్ద ఉన్న డాలర్ విలువ పెరిగిపోయింది. యుద్ధం తర్వాత ఆర్థికంగా నష్టపోయిన దేశాలకు అమెరికా డాలర్ల రూపంలో అప్పులు ఇవ్వడం ప్రారంభించింది. ఇలా ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసి అవసరమైన దేశాలకు అప్పులు ఇస్తూ వస్తుంది. అలా సమావేశమై నిర్ణయించిన డాలర్ ఇప్పటికీ ప్రపంచంలో పై చేయి సాధిస్తుంది. మిగతా దేశాల్లో కంటే డాలర్ దే పెత్తనంగా ఉంది.
మొత్తంగా డబ్బు మెసపటోమియాలో ప్రారంభమై.. అమెరికాలో ఎక్కువగా ఉండిపోయింది.