Tuesday, June 24, 2025

‘వనౌటు’ దేశం ఎక్కడుంది? ఎలా వెళ్లాలి?

Indian Premiur Legue(IPL) ఫౌండర్ లలిత మోడిని పట్టుకునేందుకు భారత్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఐపీఎల్ కు చైర్మన్ గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని ఆరోపణ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన 2017లో లండన్ కు పారిపోయారని తెలుస్తోంది. అప్పటినుంచి లలిత్ మోడీ లండన్ లోనే ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన ఇటీవల తాను వనౌటు అనే ప్రదేశంలో ఉన్నట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పాస్ పోర్టును లండన్ లోని భారత హై కమిషన్ లో అప్పగించి.. ఆ తరువాత వనౌటు పౌరసత్వం పొందినట్లు తెలిపారు. కానీ ఆ తరువాత తన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనౌటు దేశ ప్రధాని మంత్రి జోథం నపాట్ తాజాగా కమిషన్ ను ఆదేశించారు. దీంతో ఆయన కొత్త ఇబ్బందుల్లో పడ్డారు. ఇదిలా ఉండగా.. ఆయన సందర్శించిన వనౌటు దేశం ఎక్కడుంది? అని చాలా మంది ఆరాతీస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే ..

పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 80 ద్వీపాలతో వనౌటు దేశం నిర్మితమైంది. 1300 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఇక్కడ పగడపు దిబ్బలు, నీటి అడుగున గుహాలు కనిపిస్తాయి. వనౌటు దేశ రాజధాని పోర్టు విల్లా. ఇది ఎపోర్ట్ ద్వీపంలో ఉంది. ఇక్కడ ఉన్న మ్యూజియం ఆకర్షిస్తుంది. మెలనేసియన్ సంస్కృతికి అద్దంపట్టే ఈ దేశంలో అధికారిక భాష బిస్లామా, ఫ్రెంచ్, ఇంగ్లీష్. ఈ దేశంలో మొత్తం జనాభా 3.2 లక్షల జనాభా ఉంది. వనౌటు దేశంలో 2024 డిసెంబర్ 17న తీవ్ర భూకంపం సంభవించింది. ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 7.3లో తీవ్రత నమోదు కావడంతో దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్టు విల్లా ప్రజలు ఆందోళన చెందారు.

భారత్ నుంచి వనౌటు దేశానికి వెళ్లాలంటే ఢిల్లీ నుంచి పోర్ట్ విల్లాకు నేరుగా విమానాలు ఉన్నాయి. 28 గంటల 25 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటారు. చెన్నై నుంచి కూడా వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫ్లైట్ రూ.84,266 ధర ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా, ఉత్తర న్యూజిలాండ్… మధ్య ఆస్ట్రేలియా , ఫిజి మధ్య ఈ దీవులు కనిపిస్తాయి.

ఇక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు తీసుకునే వనౌటు గోల్డెన్ పాస్ పోర్టు కింద లలిత్ మోడీ ఇక్కడ పౌరసత్వాన్ని తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం లలిత్ మోడీ ని భారత్ కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇక్కడ పాస్ పోర్టు తీసుకోవడం తీవ్ర చర్చ జరిగింది. కానీ వెంటనే అక్కడి ప్రధాని పాస్ పోర్టు రద్దు చేశారు. దీంతో ఆయన పరిస్థితి అయోమయంగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News