ధర్మం నాలుగుపాదాలపై ఉన్నప్పుడు సమాజం సంతోషంగా ఉంటుంది. ప్రజలు ఆనందంగా జీవిస్తారు. మనుషుల మధ్య ఎలాంటి అనుమానాలు, స్వార్థాలు లేకుండా ప్రేమ, ఆప్యాయతలో జీవిస్తారు. సమజాంలో కొన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయంటే.. అవీ ఎక్కువవతున్నాయంటే లోకం అంతమయ్యే సమయం ఆసన్నమైందని కొన్ని పురాణాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుత సమాజాన్ని చూస్తే అలానే అనిపిస్తుంది. ఇదే సమయంలో భవిష్యత్ లో ఏం జరగబోతుందో ముందే ఊహించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కలిసి తీసిన ‘కల్కి AD 2898 AD’ అనే సినిమా రాబోతుంది. జూన్ 27న ఇది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా అసలు కల్కి రియల్ కథేంటి? కలి ఎవరు? కల్కి ఎవరు? అనేది ఆసక్తిగా మారింది..
‘కలి’ని అంతం చేయడానికి ‘కల్కి’..
భూమిపై ఎప్పుడైతే పాపాలు మితిమీరిపోతాయో అప్పుడు శ్రీ మహా విష్ణువు అవతారం ఎత్తి ఆ లోకాన్ని అంతం చేస్తాడు. ఇప్పటి వరకు 9 యుగాలు గడిచిపోయి. విష్ణువు 9 అవతారాలు ఎత్తారు. పదవది ‘కల్కి’ అవతారం అని వినిపిస్తోంది. అయితే కల్కి అవతారం ఎత్తే ముందు ‘కలి’ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే కలిని అంతం చేయడానికి ‘కల్కి’ పుడుతాడు.
పదో అవతారం ‘కల్కి’
తొమ్మిది యుగాలు పూర్తయి ప్రస్తుతం ‘కలి’ యుగం నడుస్తోంది. కలియుగం మొత్తం కలి అనే రాక్షసుడి చేతిలోకి వెళ్లిపోయింది. వేదాల ప్రకారం కలియుగంలో పాపాలు ఎంతగా పెరుగుతాయి అంటే అసలు ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడే వారి సంఖ్య తగ్గుతంది. ప్రజల్లో క్రూరత్వం, హింస, స్వార్థం అనేది ఎక్కువైపోతుంది.ద్వాపరయుగం తర్వాత ఆవిర్భవించిన కలియుగంలో ఇప్పటివరకు కేవలం సమస్యలు మాత్రమే గడిచాయి. ఇప్పటి నుంచి పాపాలు ఘోరంగా పెరుగుతాయని మన పురాణాల్లో రాసి ఉంది. కానీ కొన్ని గ్రంథాల్లో మాత్రం కలియుగంలోని మొదటి 10 వేల సంవత్సరాలు ప్రపంచం ఎంతో శాంతియుతంగా, ప్రజల మధ్య ఎక్కువగా ప్రేమ వికసిస్తుందని రాయబడింది. కానీ పదివేల సమస్యలు గడిచిన తర్వాత మనుషుల యొక్క అసలు రూపం బయటకు రానింది. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందంటే ప్రజల మధ్య ప్రేమ, ఐకమత్యం, శాంతి అనేది ఏ మాత్రం ఉండదు. అన్యాయాలు అక్రమాలు అధర్మాలు ప్రపంచాన్ని డామినేట్ చేస్తాయి. మనుషులంతా స్వార్థపరులుగా మారతారు. ఆ సమయంలో ప్రజలు తమ సొంత వారిని కూడా నమ్మడం మానేస్తారు. ఎప్పుడైతే ప్రజల్లో స్వార్థం పెరుగుతుందో.. ఆ స్వార్థం మెల్లగా యుద్ధానికి దారితీస్తుంది. ప్రజల దగ్గర తినడానికి తిండి గానీ, తాగడానికి నీరు గానే ఉండదు. ప్రపంచవ్యాప్తంగా నదులన్నీ ఎండిపోతాయి. ఆకాశమంత అంధకారం అలుముకుంటుంది.
‘కలి’ ఎలా ఉంటాడు?
సరిగ్గా అప్పుడే కరువుతో ఎండిపోయి ఉన్న భూమిని బద్దలు కొడుతూ ‘కలి‘ అనే ఒక అతి భయంకరమైన రాక్షసుడు పుడతాడు. ఇతను పాపానికి, హింసకి ప్రజల్లోని స్వార్థానికి ప్రతిరూపం లాంటివాడు. ఈ రాక్షసుడు చూడడానికి అతి భయంకరంగా ఉంటాడు. తన శరీరమంతా అంధకారం నిండిపోతుంది. తన పళ్ళు దవడ నుంచి బయటకు వచ్చి ఉంటాయి. తన కళ్ళు నరకంలో నిరంతరం మండే అగ్ని లాగా కనిపిస్తాయి. అలాగే అతని శరీరం నుంచి అతి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఇతని ఆకారం ఎలా ఉంటుందంటే ఇతని చూస్తే ఇతని పుట్టుకకు ప్రధానమైన కారణం భూమిపై పెరుగుతున్న పాపం, అధర్మం. ఇతను కేవలం రాక్షసుడు మాత్రమే కాదు ఈ మొత్తం కలియుగానికి ఒక ప్రతీక. అందుకే ఈ యుగానికి పేరు కూడా ‘కలి’ యుగంగా పేర్కొన్నారు.
దేవతలను కాదని ‘కలి’కి పూజలు..
మనుషుల్లో ఉండే క్రూరత్వం, స్వార్థం పాపం చేసేవే కలి ప్రధానమైన ఆయుధాలు. వాటిని ఉపయోగించి ఇతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని తన వైపు తిప్పుకుంటారు. వారిని ఇతని భక్తులుగా మార్చుకుంటాడు. మన పురాణాల ప్రకారం ఇతను కలియుగంలో ఎంత శక్తిమంతుడిగా మారుతాడు అంటే.. మనుషులు దేవతలను పూజించడం మానేసి.. ఈ అతి భయంకరమైన రాక్షసుడిని పూజిస్తారు. దాంతో మెల్లమెల్లగా మనుషుల రూపం కూడా మారి రాక్షసుల్లాగా మారుతారు. అంటే ఈ మనుషులు తోటి మనుషుల్ని చంపి తినడం మొదలుపెడతారు. ప్రపంచంలో ఎటు చూసినా కనిపిస్తుంది హత్యలు, మానభంగాలే కనిపిస్తా యి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమను తామే నాశనం చేసుకుంటారు.
‘కల్కి’ జననం..
ఈ కలియుగ ఆగడాలు మితిమీరుతాయో సరిగ్గా ఆ సమయంలోనే శ్రీ మహా విష్ణువు పదవ అవతారం ఎత్తుతారు. కొన్ని పురాణాల ప్రకారం ఈ కల్కి శుక్లపక్ష ద్వాదశి పౌర్ణిమకి 12 రోజుల తర్వాత శాంబాలా అనే గ్రామంలో జన్మిస్తాడు. బ్రాహ్మణ దంపతులైన విష్ణు వ్యాస, సుమతిలకు ఈ కల్కి పుడతాడు. ఈ కల్కికి నలుగురు సోదరులు కూడా ఉంటారు. ఈ నలుగురు కూడా కల్కి చేసే పనులకు సాయం చేస్తారు. ఇక కల్కి అవతారం ఎలా ఉంటుందంటే అతను దేవదత్త అని ఒక తెల్లటి గుర్రాన్ని స్వారీ చేస్తూ సూర్య కిరణాలు ఉండే తేజస్సును కలిగి ఉంటాడు. తన చేతిలో నిప్పులు వెదజల్లే రెండు ఆయుధాలు కూడా ఉంటాయి. కల్కికి ప్రత్యేకమైన దివ్య దృష్టి కూడా ఉంటుంది. కలియుగం అంతమయ్యే కొన్ని సమస్యలను ముందు కల్కి జన్మిస్తాడు .
పరుశురాముడు, అశ్వథ్తామలు..
కలియుగాన్ని అంతం చేయడం ప్రపంచమంతా ఆక్రమించిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరించడం ఈ కల్కి మానవ రూపంలో పుట్టినప్పటికీ తన రూపం మాత్రం ఒక పరాక్రమవంతుడైన యోధుడిగా ఉంటుంది. నిజానికి చిరంజీవిలు కల్కి కోసం వేల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. వీరిలో హనుమంతుడు, పరుశురాముడు, అశ్వథ్థామ, విభీషణుడు, గురు కృపాచార్యసుడు కల్కి పుట్టినప్పుడే అతని దర్శనం కోసం వస్తారు. వీళ్లే కల్కికి నామకరణం చేస్తాడు. ఈ కల్కికి పరశురాముడు వేదాలు, శాస్త్రాలు బోధించి ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి? అనేది నేర్పిస్తారు. ఆ విధంగా పరుశురాములు కల్కికి 64 విద్యను నేర్పిస్తాడు. అలాగే మిగతా చిరంజీవిలు కూడా కలిని ఓడించేందుకు కావలసిన విద్యను నేర్పిస్తారు.
‘కలి’తో ‘కల్కి’ యుద్దం..
కలి ఆగడాలు పెరిగిపోయి అంతమయ్యే సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు కల్కి తన దేవ దత్త అనే తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ప్రకాశవంతమైన ఒక ఖడ్గాని ధరించి అధర్మాన్ని అంతం చేయడానికి కలి పై యుద్ధానికి బయలుదేరుతాడు. యుద్ధరంగంలో అడుగుపెడుతూనే కల్కి శరీరం నుంచి శక్తివంతమైన ఒక తేజం బయటకు వస్తుంది. దాంతో దివ్య రూపాన్ని ధరిస్తాడు. అతి భయంకరమైన రాక్షసి రూపం ధరించి కల్కితో యుద్ధానికి దిగుతాడు. కల్కి ఒక్కడే రాక్షస సైనికుల్ని అంతం చేస్తాడు. అప్పుడు మొదటిసారి కలి కళ్ళల్లో మొదటిసారిగా భయం కనిపిస్తుంది. చివరికి అధర్మం నశించి ధర్మం గెలుస్తుంది. ఆ తర్వాత కొత్త కాలచక్రం మొదలవుతుంది. ఈ కల్కి కొత్త యుగానికి నాంది పలుకుతాడు అదే సత్వయుగం. అప్పుడు ప్రజలు మళ్ళీ సుఖశాంతులతో శాంతియుతంగా జీవిస్తారు.