Tuesday, June 24, 2025

ఈ సంవత్సరం దీపావళి పూజలు ఎప్పుడు? ఆ రోజు ఈ వస్తువులను ఎందుకు కొనాలి?

హిందూ శాస్త్రం ప్రకారం దీపావళి బిగ్ ఫెస్టివెల్. ప్రతీ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు.ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీపూజలు చేస్తూ.. బాణ సంచాల కాలుస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా వ్యాపారులు కొత్త ఖాతాబుక్ ను తెరుస్తారు. ఇన్ని రోజులు చేసిన తప్పులు క్షమించమని, ఇప్పుటి నుంచి తమను ఆర్థికంగా ఆదుకోవాలని లక్ష్మీదేవిని వేడుకుంటారు. అయితే ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 31 అని కొందరు.. నవంబర్ 1 అని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ సమయంలో పూజలు నిర్వహించుకోవడం శుభప్రదమో తెలుసుకుందాం..

ఈ సమయంలోనే పూజలు..?

2024 ఏడాది పంచాంగం ప్రకారం.. దీపావళి అక్టోబర్ 31న నిర్వహించుకుంటారు. ఈ రోజు ఉదయం యధావిధంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అయితే వేద క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ మధ్యాహ్నం 3.12 గంటలకు అమావాస్య మొదలవుతుంది. ఇది నవంబర్ 1న సాయంత్రం 5.14 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత పాడ్యమి మొదలవుతుంది. అయితే పాడ్యమి మొదలు కాకముందే దీపావళి వేడుకలు నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు. అంటే దీపావళి వేడుకలు రాత్రి సమయాల్లోనే ఎక్కువగా నిర్వహించుకుంటారు. అందువల్ల అక్టోబర్ 31న నిర్వహించుకోవాలని చెబుతున్నారు.

ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి?

చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను నిర్వహించుకుంటారు. అందువల్ల ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల ఏడాదంతా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈరోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల సిరిసంపదలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. దీపావళి రోజున అలంకరణ సామగ్రి, శ్రీ యంత్రాలు, గోమతి చక్రం కొనుగోలు చేయడం మంచిది. అలాగే లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడం శుభప్రదం. ఇక ఈరోజు ఎరుపు దుస్తులను ధరించడం వల్ల సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. ఎర్రని దుస్తులు కొనుగోలు చేయడం కలిసి వచ్చే అవకాశం ఉంది.

ఈరోజు ఏవీ చేయొద్దు?

దీపావళి రోజు ప్రతి ఒక్కరి ఇంటికి లక్ష్మీదేవి రావాలని అనుకుంటుంది. కానీ ఇల్లు శుభ్రంగా లేకపోతే వారి ఇంటివైపు చూడదని కొన్ని పురాణాల బట్టి తెలుస్తుంది. లక్ష్మీదేవి స్వచ్ఛతకు ప్రతిరూపం. అందువల్ల కొత్త బట్టలు ధరించి ఉండడం మంచిది. లేదా శుభ్రంగా ఉన్న దుస్తులను ధరించాలి. నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించొద్దు. ఈరోజన ఇతరులను తిట్టడం, ధూషించడం చేయడం వల్ల అశుభాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News