భూమి మీద ఉన్న సరీసృప జీవి పాములు. ప్రపంచంలో ఒక్క అంటార్కిటికా ప్రాంతంలో తప్ప అన్ని చోట్లా పాములు కనిపిస్తాయి. ఇవి ఆయా ప్రాంతాలను భట్టి వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని పాములు విష పూరితమైనవి. మరికొన్ని పాములు కరిచినా పెద్ద ప్రమాదమేమీ కాదు. పాములు క్రెటేషియన్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుంచి పరిణామం చెందినట్లు పురాణాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించిన శాస్త్రానని సర్పెంటాలజీ అంటారు. ప్రతీ సంవత్సరం జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే వర్షాకాలం ప్రారంభమవుతున్నందున పాములు పాములు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఈ సమయంలో అడవుల్లో, చెట్లల్లో ఉండే పాములు ఒక్కోసారి ఇంట్లోకి వస్తాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలి?
పాము పేరు చెబితేనే చాలా మంది భయపడుతుంటారు. అది కళ్లకు కనిపిస్తే వణికిపోని వారుండరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం 50 లక్షల మంది పాముకాటుకు గురి కాగా.. అందులో 1.38 లక్షల మంది మరణిస్తున్నారు. 2020 ఏడాది లెక్కల ప్రకారం భారత్ లో 2000 సంవత్సరం నుంచి 2019 వరకు 12 లక్షల మంది పాముకాటుకు గురై మరణించారు. పాముకాటుకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా సత్వర వైద్యం అందకపోవడం వల్ల ఈ మరణాలు సాగుతున్నాయి.

పాములకు మనుషుల కంటే భయం ఎక్కువ. అవి తమను తాము కాపాడుకోవడానికే ఇతరులపై దాడి చేస్తాయి. ముఖ్యంగా మనుషుల అలికిడి వింటే పాములకు చాలా కోపం వస్తుంది. అయితే కొందరు పామును చూడగానే భయభ్రాంతులకు గురవుతారు. మరికొందరు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా హంగామా చేస్తూ దానిని చంపేస్తారు. వాస్తవానికి ఏ పాము ప్రత్యేకంగా మనుషులను చంపడానికి బయలుదేరదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి పాము ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల జూన్ 7 హైదరాబాద్ లో విద్యుత్ తీగలపై పామును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇలా పాము కనిపించినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే పాము కరువ కుండా ఉంటుంది? అనే విషయంపై అవగాహ ఉండాలి. అప్పుడే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు.
- పాము కనిపించగానే చాలా మంది ఇంటి తలుపులు వేస్తారు. కిటికీలు కూడా వేసి దానిని బయటకు వెళ్లకుండా చేస్తారు. దీంతో అవి ఏ రంద్రాల్లో ప్రవేశిస్తే పట్టుకోవడం కష్టంగా మారుతుంది.
- పాము కనిపించిన వెంటనే పరుగెత్తకూడదు. పాము ఉన్న దిశలో కాకుండా వ్యతిరేక దిశలో చడీ చప్పుడు కాకుండా అడుగులు వేయాలి..
- పాము కనిపించగానే దానిపై దాడి చేయడానికి ప్రయత్నించకూడదు. ఎలాంటి హంగామా చేయకుడా దానిని వదిలేయాలి.
- పాములకు మనుషులంటే అస్సలు ఇష్టముండదు. అందువల్ల అవి మనుషుల అలికిడి వినగానే దాడికి ప్రయత్నిస్తాయి. అందువల్ల మనం అక్కడున్నామన్న విషయం పాముకు తెలియకూడదు.
- పాము ఇంట్లో కనిపిస్తే ఎలాంటి శబ్దాలు చేయకూడదు. పాములకు చెవులు ఉండవు. కానీ అవి శబ్ద కంపనాలను త్వరగా పసిగడుతాయి.

- ఒక్కోసారి పెద్ద శబ్దాల వల్ల పాములు పారిపోతాయి. కానీ ఇవి పాములు పట్టేవారి సమక్షంలోనే చేయాలి.
- ఎలాంటి అవగాహన లేకుండా పాములు పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. వాటికి దూరంగా శబ్దాలు చేస్తే అవి వెళ్లేలా దారిని ఉంచాలి. అప్పుడే పాము ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
- పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయని అనుకుంటే అగ్నిమాపక సిబ్బంది, పాములు పట్టేవారి నెంబర్లను దగ్గర్లో ఉంచుకోవడం మచిది.