Saturday, December 6, 2025

రాకెట్ ప్రయోగించే ముందు ఎలాంటి టెస్ట్ చేస్తారంటే?

భారతదేశంలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 30న బుధవారం ప్రయోగించిన GSLV-F-16 రాకెట్ విజయవంతం అయింది. దీనిని నాసా తో కలిసి అభివృద్ధి చేశాయి. భూమిపై నిఘా వ్యవస్థలాగా ఇది పనిచేస్తుంది. అయితే జూలై 31న ఆస్ట్రేలియా దేశం తొలిసారిగా రాకెట్ ప్రయోగం చేసింది. 23 మీటర్ల రాకెట్ లాంచింగ్ టవర్ కంటే కొంచెం దూరం వెళ్లి ఆ తరువాత పేలిపోయింది. ఇలా కొన్నిప్రయోగాలు సక్సెస్ అవుతూ.. మరికొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి.. అయితే రాకెట్ ప్రయోగానికి ముందే కొన్ని పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే?

(For Full Video.. pls.. go down)

రాకెట్ ప్రయోగం అంటే సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఇది జరిగే ముందు చాలా దశల్లో టెస్టింగ్ నిర్వహిస్తారు. రాకెట్ టెస్ట్ ప్రక్రియలు ముఖ్యంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు:

భౌతిక భాగాల టెస్టింగ్ (Component Level Testing)

ఈ దశలో రాకెట్ లో వాడే ప్రతి భాగాన్ని విడిగా పరీక్షిస్తారు. ఇందులో మొదటగా ఇంజిన్ టెస్ట్ చేస్తారు. అంటే ఇంధనం తగిన రీతిలో పనిచేస్తుందా..? తాపనను తట్టుకుంటుందా అన్నదానిపై పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఇంధన ట్యాంకులు పరిశీలిస్తారు. గరిష్ట ఒత్తిడిని తట్టుకోవాలన్న లక్ష్యంతో హైడ్రోస్టాటిక్ టెస్ట్, క్రయోజెనిక్ టెస్ట్ లు నిర్వహిస్తారు. ఎలక్ట్రానిక్స్ & సెన్సార్లు కూడా పరీక్షిస్తారు. ఆపరేటింగ్ పరిధిలో పనిచేస్తాయా? ఎర్రర్లు వస్తాయా? అనే అంశాలను టెస్ట్ చేస్తారు.

సిస్టమ్ స్థాయి టెస్టింగ్ (System Level Testing)

ఈ దశలో విడివిడిగా పరీక్షించిన భాగాలను కలిపి మొత్తం వ్యవస్థను పరీక్షిస్తారు. ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే అన్ని భాగాలు కలిపిన తర్వాత అవి సమర్ధంగా పనిచేస్తాయా లేదా అన్నది తెలుసుకుంటారు. కమ్యూనికేషన్ టెస్ట్ అంటే గ్రౌండ్ స్టేషన్ తో రాకెట్ సరైన కమ్యూనికేషన్ లో ఉందా అనేది చూస్తారు. అలాగే వైబ్రేషన్ టెస్ట్ కూడా చేస్తారు. ప్రయోగ సమయంలో వచ్చే కంపనాలను రాకెట్ తట్టుకోవగలదా అని పరీక్షిస్తారు . థర్మల్ టెస్ట్ అంటే ఎత్తైన ఉష్ణోగ్రతలు, తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న పర్యావరణంలో టెస్ట్ చేస్తారు.

సిములేటెడ్ లాంచ్ టెస్ట్ (Simulated Launch): లాంచ్ సమయంలో జరగబోయే ప్రతి చర్యను గ్రౌండ్ స్టేషన్ లో ప్రాక్టీసు చేస్తారు.

ఫ్యూయల్ లోడింగ్ టెస్ట్: రియల్ ఇంధనాన్ని భర్తీ చేయడం, లీక్ ఉందా లేదో చూడటం… కౌంట్‌డౌన్ రిహర్సల్ చేయడం.. అంటే నిజమైన ప్రయోగం మాదిరిగా కౌంట్‌డౌన్ ప్రాసెస్ ఒకసారి డ్రై రన్ చేస్తారు. ఫైళ్ల వెరిఫికేషన్ & అనుమతులు కూడా చూస్తారు. అంతరిక్ష సంస్థల నుంచి గ్రీన్ సిగ్నల్ (GO/NOGO) వస్తే ప్రయోగానికి ముందడుగు వేస్తారు.

భారత అంతరిక్ష సంస్థ (ISRO)లో ప్రయోగానికి ముందు జరిగే కొన్ని ముఖ్యమైన టెస్టులు:

Stage Separation Test

Payload Fairing Separation Test

Autonomous Flight Termination System (AFTS) Test

Ground Support Equipment Test

Flight Simulation & Mission Readiness Review

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News