తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లే బాధ్యత ఒక్క డైరెక్టర్ల పైనే ఉంటుంది. వారు రచించే కథల నుంచి టేకింగ్ బాగుంటే వరల్డ్ లెవల్లో గుర్తింపు వస్తుంది. అలా ప్రతీ సినిమాతను ఒక ఛాలెంజ్ గా తీసుకొని సక్సెస్ ఫుల్ సినిమాలు అందించే రాజమౌళి పేరు సినీ లోకంలో మారుమోగుతూ ఉంటుంది. అలాంటి డైరెక్టర్ పై ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఓ డాక్యుమెంటరీని తీశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ NETFLIX సంస్థ తీసిన ఈ డాక్యమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసింది. దీని ఫుల్ డాక్యమెంటరీని ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈ ట్రైలర్ లో ప్రముఖ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ లతో పాటు సంగీత దర్శకుడు కీరవాణి రాజమౌళి గురించి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతారు. ఇందులో రాజమౌళి సతీమణి రమా కూడా కనిపిస్తారు. ఇందులో ‘రాజమౌళి వల్ల మీకు ఎలాంటి తలనొప్పి ఉంటుంది?’ అనే ప్రశ్నకు అందరూ ఆసక్తికరమైన సమాధానం ఇస్తారు. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన గంటలోనే 40 వేల మంది వీక్షించారు. దీంతో రాజమౌళికి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చని కొందరు కొనియాడుతున్నారు. ఆ ట్రైలర్ ను మీరూ చూసేయండి..