Sunday, December 7, 2025

ఛత్తీస్ గఢ్ లో రివర్స్ లో నీరు ప్రయాణించడానికి కారణం ఏంటీ?

ఒక చోట నీరు పోస్తే పల్లం ఉన్న చోటుకు వెళ్తాయి. కొండల్లో, అడవుల్లో పుట్టిన నీరు పల్లంగా ఉండే సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఇక్కడ నీరు రివర్స్ గా ప్రయాణం చేస్తంది. దీనినే ‘ఉల్టా పాణి’ అని అంటున్నారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సూరజ్ పూర్ జిల్లాలో ‘ఛత్తీస్ గఢ్ షిమ్లా’ అని పిలిచే ఓ పర్వతం వద్ద నీరు పైకి వెళ్తుంది. దీనిని తాజాగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పరిశీలించారు. ఈ నీటిపై ఓ కాగితపు పడవ వేసి చూడగా.. ఇది వ్యతిరేక దిశలో వెళ్లడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టును కూడా ఎక్స్ ఖాతాలో ఉంచారు. అయితే దీని స్టోరీ ఏంటీ? ఇలా నీరు ఎందుకు పైకి వెళ్తుంది?

చత్తీస్ గఢ్ షిమ్లా అనే ప్రాంతం హిల్ స్టేషన్ గా భావిస్తారు. ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ నీర వ్యతిరేక దిశలో పయనించడానికి ఓ పురాణం కథ ఉంది. పూర్వ కాలంల ఒక రుషి ఇక్కడ తపస్సు చేసేవాడు. అయితే అతని దేవతలు వరం ఇవ్వగా.. ఇక్కడున్న పర్వత శ్రేణుల మధ్య నీటిని వెలికి తీశాడు. అయితే అతడి శక్తితో ఈ నీరు పైకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పయనిస్తుందని అంటారు.

అయితే దీనిపై కొందరు భూగోళశాస్త్ర పరిశోధకులు మాత్రం వేరే చెబుతున్నారు. ఇక్కడ నేల తలకిందులుగా ఉంటుంది. నీరు కిందికి వెల్తున్నా.. పైకి వెళ్లినట్లు భావన కలుగుతుందని అంటున్నార. ఇది గ్రావిటీ హిల్ స్టేషన్ అని తెలిపారు.

ఏదీ ఏమైనా ఇక్కడ ఉన్న అద్భుతాన్ని చూడ్డానికి చుట్టుపక్కల వారు తరలివస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News