Wednesday, February 5, 2025

మూసీ నది చరిత్ర ఏంటీ? వివాదం ఎందుకు?

హైదరాబాద్ లోని మూసీ నదిపై రోజుకో చర్చ.. ఏదో ఒక వివాదం.. ఈ నదికి పునరుజ్జీవం పోస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం మూసీ నది పరివాహక ప్రాంత నిర్వాసితులకు అన్యాయం చేస్తోందని చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలేం జరుగుతోంది? అని కొంతమందిలో అయోమయం నెలకొంది. అసలు మూసీ నది చరిత్ర ఏంటీ? దీనికి పునరుజ్జీవం పోయాలని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నారు? దీని కోసం ప్రత్యేకంగా నిధులు ఎందుకు కేటాయిస్తున్నారు? ఆ వివరాల్లోకి వెళితే..

లండన్ వెళ్లిన ప్రతి ఒక్కరూ థేమ్స్ నది పక్కన కాసేపు సేద తీరానుకుంటారు. చుట్టు పక్కల భవనాలు ఉన్నా.. ఈ నదిలోని నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఆహ్లాదాన్ని నింపుతుంది.ఒకప్పుడు ఇది మూసీ నదిలాగే ఉండేది. 1957లో దీనిని బయోలాజికల్లీ డెడ్ అని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది. ఆ తరువాత ప్రభుత్వం కేర్ తీసుకొని ప్రక్షాళన చేసింది. ఇప్పడు లండన్ అంటే థేమ్స్ నది గుర్తొచ్చేలా తయారైంది. అలాగే హైదరాబాద్ లోని మూసీ నదిని అలా తయారు చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన.

ప్రపంచంలోని అత్యంత మురికి నదుల్లో మూసీ నది ఒకటి. ఇది ఒకప్పుడు గోదవరి, కృష్ణాల మాదిరిగానే ఎప్పటికీ నీటితో ఉండేది. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న మూసీ వికారాబాద్ లోని అనంతగిరి కొండల్లో పుడుతుంది. ఆ తరువాత హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల గుండా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.

20వ శతాబ్దంలో మూసీ నదికి వరదలు పెరిగాయి. 1908వ సంవత్సరం సెప్టెంబర్ 28న హైదరాబాద్ కు మూసీ నది ద్వారా వరదలు వచ్చి 15,000 మంది మరణించారు. దీంతో మరోసారి ఇలాంటి విపత్తు జరగకుండా ఉండడానికి 1912 నిజాం 8వ కాలంలోసిటీ ఇంప్రూవ్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్(హుస్సేన్ సాగర్) ఆనకట్టను 1920లో నిర్మించారు. ఆ తరువాత 1927లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుఏర్పాటు చేశారు. దీంతో మూసీ నది వరదల నుంచి కొంత ప్రభావం తగ్గింది. ఆ తరువాత చివరి నిజాం కాలంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో 14 చోట్ల పార్కులు నిర్మించారు. 1997లోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మూసీ నదిని సుందరీకరించాలని అనుకున్నారు. బాపూఘాట్ నుంచి నాగోలు వరకు అభివృద్ధి పనులు చేపట్టింది. నిర్వాసితులకు సైతం కర్మన్ ఘాట్ సమీపంలో నందనవనం పేరుతో కాలనీ నిర్మించింది. అయితే పర్యావరణ వేత్తల అభ్యంతరాలతో 2001లో వీటి పనులు ఆగిపోయాయి.

ఆ తరువాత 2005లో సేవ్ మూసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని సుందరీకరించాలని అనుకున్నారు. ఇందుకోసం రూ.330 కోట్లు నిధులు విడుదల చేశారు. కానీ 2013లో ఇది ముందుకుసాగలేదు. ఆ తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చా 2017లో మూసీ రివర్ ప్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. 115 కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ఇందుకోసం రూ.16,635 కోట్లు నిధు అంచనాలు వేశారు.

అయితే నగరీకరణ కారణంగా హైదరాబాద్ జంట నగరాల్లో భవనాల నిర్మాణం ఎక్కువైంది. దీంతో ఇళ్లలో నుంచి వచ్చే నీరు మూస నదిలో కలవడంతో సాధారణ నది కాస్త కాలుష్య నదిగా మారింది. 2022లో మూసి నది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నదిలో 22వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో దీనిని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటోంది. 2015లో జారీ చేసిన జీవో ప్రకారం మొత్తం మూసీ నదికి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. మొత్తం 55 కిలోమీటర్ల వరకు 10,600 కట్టడాలను గుర్తించారు. వీటిని తీసేస్తే గానీ సుందరీకరణ సాధ్యం కాదని రేవంత్ ప్రభుత్వం అంటోంది. అయితే నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News