Tuesday, June 24, 2025

ప్రదోష కాలం అంటే ఏమిటి? ప్రదోష వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఫలితాలేంటి?

జీవితం కష్టసుఖాలమయం. తెలియక చేసినా.. తెలిసి చేసినా తప్పు తప్పే.. అయితే వీటి నుంచి విముక్తి పొందడానికి దేవుళ్లను ప్రార్థిస్తుంటారు. సాధారణ రోజుల్లో ఎన్నిసార్లు గుడికి వెళ్లినా ఒక్కోసారి ప్రయోజనాలు ఉండవు. కానీ ప్రత్యేక రోజుల్లో భక్తితో దేవళ్లను కొలవడం వల్ల అనుకున్న విజయాలు సాధిస్తారు. హిందూ క్యాలెండర్ లో ‘ప్రదోష కాలం’ ను ప్రత్యేకంగా పేర్కొంటారు. ఈ సమయంలో కొన్ని పూజలు చేయడం వల్ల ఇంతకాలం కష్టాలు ఉన్నవారు విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దేవుళ్లను పూజించడం వల్ల వారిపై దైవానుగ్రహం వెంటనే ఉంటుందని అంటారు. మరి ప్రదోష కాలం అంటే ఏమిటి? ఈ సమయంలో ఎవరికి పూజ చేయాలి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

ప్రదోష కాలం అంటే?
సాధారణ సమయం కంటే ప్రదోష కాలం ప్రత్యేకమైనది. సూర్యాస్తమ సమయంలో చంద్రుడి కదలిక మొదలైనప్పుడు మధ్యలో ఉండే కాలాన్ని ప్రదోష కాలం అంటారు. అంటే సూర్యాస్తమ సమయానికి 1.5 గంటల ముందు నుంచి తరువాత 3 గంటల వరకు మధ్య సమయంలో ఏర్పడే తిథులను బట్టి ప్రదోష కాలాన్ని నిర్ణయిస్తారు. అయితే ప్రతి రోజూ ప్రదోష కాలం ఉంటుంది. కానీ కొన్ని తిథుల రోజున ఏర్పడేదానికి ప్రాధాన్యం ఉంటుంది. చతుర్థి, సప్తమి, త్రయోదశి లో కలిగే ప్రదోషాలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలాన్ని మహా ప్రదోషం అని అంటారు.

ప్రదోష కాలంలో ఎవరికి పూజ చేయాలి?
సృష్టిపై ఎక్కువగా శివుడికే అధికారం ఉంటుంది. అందువల్ల ప్రదోషకాల ఫలితాలు పొందాలంటే ప్రదోష కాలం రోజున శివుడికి పూజ చేయాలి. ఈరోజు ప్రదోష వ్రతం పాటించేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తెల్లటి వస్త్రం ధరించి రుద్రాక్షను ధరించాలి. ఆ తరువాత ఓం నమ: శివాయ అంటూ జపం చేయాలి. ఇలా రోజంతా శివభక్తిలో ఉండాలి. అయితే సూర్యాస్తమ సమయంలో మరోసారి స్నానం చేసి ఇంట్లో పూజ ముగించాలి. ఆ తరువాత శివాలయాన్ని దర్శించుకోడం మంచిది.

ప్రదోష కాలం ఎప్పుడెప్పుడు ఉన్నాయి?
ప్రదోష కాలం ప్రతి నెలలో దాదాపుగా వస్తుంటుంది. ప్రతినెలల త్రయోదశి పక్షంలోని 13వ రోజు, ద్వాదశి సెప్టెంబర్ 15న ప్రదోష కాలం ఏర్పడింది. అక్టోబర్ 15, నవంబర్ 13, డిసెంబర్ 13న ప్రదోష కాలం ఉండనున్నాయి.

ప్రదోష వ్రతం తో ఎలాంటి ప్రయోజనాలు?
హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించడం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. అనుకున్న పనులు పూర్తి కావడానికి, పితృదోశం నుంచి విముక్తి కలగడానికి, ఆర్థికంగా లాభాలు పొందేందుకు, అప్పుల నుంచి బయటపడడానికి, వైవాహిక జీవితం సంతోషంగా ఉండడానికి ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News