తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడికి వెళ్లాలంటే నరకయాతన కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 12వ తేదీన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన రోడ్ షో అనే కార్యక్రమాన్ని హైదరాబాదులోని న్యాక్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా HAM విధానంలో రోడ్ల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అసలు ఈ Ham రోడ్డు అంటే ఏమిటి..? ఇవి ఎలా ఉంటాయి?
సాధారణంగా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం టెండలను పిలుస్తుంది. ఎవరైనా కాంట్రాక్టర్ దీనిని దక్కించుకొని రోడ్డు నిర్మాణం చేపడతారు. వీటిలో ఆర్ అండ్ బి వంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా డిప్యూటీ సీఎం పేర్కొన్న విధంగా HAM రోడ్ల గురించి ఆసక్తిగా చర్చి జరుగుతుంది. హ్యామ్ రోడ్లు అంటే Hybrid Manuty Model. అంటే ఇందులో కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతాయి. అంటే ఒక ప్రాజెక్టును చేపట్టినప్పుడు 40 శాతం బిల్లును ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుంది. ఆ తర్వాత మిగిలిన 60 శాతంను పనులు పూర్తయినంక వాయిదాల రూపంలో నిర్మాణ సంస్థకు చెల్లిస్తారు. ఇలా రెండు సంస్థల భాగస్వామ్యంతో నాణ్యమైన రోడ్లు నిర్మించవచ్చని భావిస్తున్నారు.
ఈ విధానంతో కాంట్రాక్టర్లపై కూడా ఒత్తిడి పడకుండా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో బిల్లులు రాక అనేక రకాలుగా ఆందోళన చెందుతున్నారు. అయితే వారు నిర్మించే పనులకు ముందుగానే ప్రభుత్వం కొంత భాగం చెల్లించడంతో మేలు జరుగుతుందని అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7000 కిలోమీటర్ల వరకు గ్రామీణ రోడ్లు.. 5000 కిలోమీటర్ల వరకు పట్టణాల రోడ్లు ఈ పద్ధతిన నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే గ్రామీణ రోడ్లను పట్టణ రోడ్లకు లింకు చేసే అవకాశం ఉంది.





