Tuesday, June 24, 2025

వేప చెట్టుకు కల్లు రావడానికి కారణమేంటి? దీని వల్ల ఉపయోగాలేంటి?

సాధారణంగా తాటి కల్లు తెలుసు.. ఈత కల్లు తెలుసు.. కానీ వేప కల్లు గురించి చాల తక్కువ సార్లు విని ఉంటారు. వేప చెట్టు నుంచి కూడా కల్లు వస్తుంది. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు బయటపడింది. అయితే తాజాగా సూర్యపేట జిల్లా చివ్వేంల మండలంలోని బద్యతండాలో ఓ వేపచెట్టుకు కల్లు కారడం చూసి స్థానిక ప్రజలు తరలి వస్తున్నారు. గతంలోనూ నిజిమాబాద్ జిల్లాలో వేపకల్లు రావడం గమనించారు. అయితే వేప కల్లు తాగడం వల్ల ప్రయోజనమే అని చాలా మంది అంటున్నారు. అంతేకాకుండా దీనిని సేవించడం వల్ల కొన్ని రోగాల నుంచి దూరంగా ఉండొచ్చని అంటున్నారు. అంతేకాకుండా వేప చెట్టుకు కల్లు ఎందుకు వస్తుంది?

ఉమ్మడి రాష్ట్రంలో వేప చెట్టు రాష్ట్రీయ వృక్షంగా ఉండేది. మెలియేసి కుటుంబానికి చెందిన వేప చెట్టు వల్ల అన్ని ప్రయోజనాలే. ఈ చెట్టు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

వేప పుల్లలు:
వేప చెట్టు ఆకును పలు ఆయుర్వేద మెడిసిన్ లో ఉపయోగిస్తారు. వేప చెట్టు కాండాలు(వేప పుల్ల)దంతాలను శుభ్రం చేసుకోవడానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. వీటితో దంతాలు శుభ్రం చేసుకోవడం వల్ల పళ్లు గట్టి పడుతాయి.

వేప పువ్వు:
వేప పువ్వును కూడా ప్రయోజనకరమే. దీనిని ఉగాది పచ్చడిలో కలుపుకొని తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడిని తీసేస్తుంది.

చర్మవ్యాధులు, చండ్రు నివారణ:
వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీముల్లో ఉపయోగిస్తారు. అనేక చర్మ వ్యాధుల నివారణకు వేప నూనెను ఉపయోగిస్తారు. చుండ్రు నివారణకు వేప ఆకులు బాగా పనిచేస్తాయి. వేప బెరడును కొబ్బరి నూనెలో కలిపి మరిగించాలి. ఆ తరువాత ఈ నూనెను నెత్తికి రాసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడుతారు. అంటువ్యాధుల నివారణకు వేప ఆకులు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. ముఖ్యంగా తట్టు, అమ్మవారు సోకిన వారిని వేప ఆకులపై పడుకోబెడుతారు. వేపతో చేసిన కషాయాన్ని అరకప్పు వరకు తీసుకుంటే జ్వరం కూడా తగ్గుతుంది. నులిపురుగులతో బాధపడేవారు వేపాకు రసాన్ని అరచెంచా తేనెతో కలిపి తీసుకోవాలి.

వేప కల్లు:
తాటి, ఈత చెట్ల మాదిరిగానే వేప కల్లు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ కల్లు సేవించడం వల్ల మధుమేహ వ్యాధి వారికి కంట్రోల్ అవుతుంది. అయితే వేప చెట్టు పరిసర ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువగా ఉండి.. వేప చెట్టు ఆరోగ్యంగా ఉంటే కల్లులా బయటకు వస్తుంది. వేపచెట్టు ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. అలాంటిది వేపకల్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. అయితే ఇది వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిదని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News