Saturday, February 1, 2025

అష్టకష్టాలు అంటే ఏమిటీ? అవి ఎలా ఉంటాయి?

ప్రతి మనిషి తను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకోసం ఏ కష్టం రాకుండా ఉండాలని ఓవైపు పనులు చేస్తూనే మరోవైపు దేవుళ్లను ప్రార్థిస్తారు. అయితే ఒక్కోసారి భరించలేని కష్టం వస్తుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటారు. చివరికి తమ దరిద్రం ఇంకెన్నటికి పోతుందో అని అంటూ ఉంటారు. ఇదే సమయంలో తనకు అష్ట కష్టాలు ఉన్నాయని అంటారు. అష్ట కష్టాలు గాని అష్ట దరిద్రాలు గాని అనుభవించడం కొందరి వాళ్ళనే సాధ్యమవుతుంది. అంటే ఈ దరిద్రాలను అనుభవించే సమయంలో కొందరు తట్టుకోలేక పోతారు. మరికొందరు మాత్రం వీటి నుంచి భయపడి తమ జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. అయితే అష్ట కష్టాలు అంటే ఎన్ని? అవి ఏమిటి? అనే సందేహం ఇప్పటికే చాలామందికి వచ్చి ఉంటుంది. మరి వాటి గురించి తెలుసుకోవాలని ఉందా?

అష్ట కష్టాలు లేదా అష్ట దరిద్రాలు మొత్తం ఎనిమిది. ఇవి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉంటాయి. ఒక వ్యక్తి అష్ట దరిద్రాలు అనుభవించాడంటే.. హిందూ శాస్త్ర ప్రకారం అతడు చేసుకున్న పాప పుణ్యాలు అని అంటారు. తాను చేసిన కొన్ని కార్యాలయం వల్ల ఈ అష్ట దరిద్రాలు ఎదుర్కొంటారని చెబుతారు. అష్ట దరిద్రాలలో..

మొదటిది భిక్షాటన:

కొందరు బిక్షం ఎత్తుకోవడం చూసి వారు గత జన్మలో ఏదో పాపం చేశారని.. అందువల్లే వారు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటారు. అష్ట కష్టాల్లో ఒకటైనది బిక్షం ఎత్తుకోవడం. అంటే తినడానికి తిండి దొరకక.. చేయడానికి పని లేక.. చేతిలోకి చిల్లి గవ్వ రాకుండా.. ఉండే పరిస్థితిని కొందరు ఎదుర్కొంటారు. మీరు నేరుగా బిక్షం ఎత్తుకోకపోయినా.. ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నట్లయితే.. వారు అష్ట దరిద్రాల్లో ఒకటి ఎదుర్కొంటున్నట్లే..

రెండవది పేదరికం..

పేదరికంలో జీవించడం కూడా అష్ట కష్టాల్లో ఒకటి. చాలామంది పుట్టుకతోనే పేదరికంలో ఉంటారు. కొందరు కొన్నాళ్లపాటు ఈ పరిస్థితిని ఎదుర్కొని ఆ తర్వాత హాయిగా ఉంటారు. మరికొందరు మాత్రం జీవితాంతం అదే కూపంలో ఉండిపోతారు. ఇలా పేదరికం ఎదుర్కొంటున్న వారు అష్ట కష్టాన్ని ఎదుర్కొన్నట్లేనని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది..

మూడవది భార్య లేదా భర్త వియోగం:

కొంతమందికి వివాహం అవుతుంది. కానీ భార్యతో కలిసి ఉం ఉండే పరిస్థితి రాదు. అంటే ఉద్యోగం లేదా వ్యాపార కారణాలవల్ల.. లేదా ఇతర కారణాలవల్ల భార్యకు దూరంగా ఉండాల్సి వస్తుంది. పెళ్లయిన తర్వాత ప్రతి మహిళకు లేదా పురుషుడికి తోడు భార్య లేదా భర్త. అలా వీరు ఎవరూ కోల్పోయిన లేదా వారికి దూరంగా ఉన్న అష్ట కష్టాల్లో ఒకదానిని ఎదుర్కొంటున్నట్లే.

నాలుగవది దేశీయానం:

కొందరు డబ్బు కోసం ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. కుటుంబం స్నేహితులను కలిసి దేశ విదేశాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారు జీవితంలో ఎంతో సంపాదించిన కుటుంబంతో కలిసి ఉండే పరిస్థితి రాదు. జీవితంలో కుటుంబంతో కలిసి ఉండడం కూడా అదృష్టం ఉండడమే అని అంటారు. అలాంటి అదృష్టాన్ని కోల్పోవడమే అష్ట కష్టాల్లో ఒకటి.

ఐదవది తప్పులు చేయడం:

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు అనుకోకుండానే మంచి పనులు చేస్తారు. మరికొందరు అనుకోని పరిస్థితుల్లో తప్పులు చేస్తారు. అంటే డబ్బుల కోసం దొంగతనం చేయడం లేదా భూములు ఇతర అవసరాల కోసం మరొకరిని పీడించడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా వారు ఉపశమనం పొందిన ఆ తర్వాత వారు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. అయితే పరోక్షంగా ఈ రకంగా జీవించడం కష్టమే. అష్ట కష్టాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది.

ఆరవది ఇతరులను పొగడడం:

కొందరు తమ జీవితం కోసం ఇతరులను పొగుడుతూ ఉంటారు. అలా చేయకపోతే వారికి తిండి కూడా దొరికే అవకాశం ఉండదు. అయితే ఇతరులను పోవడం కూడా అష్ట కష్టాల్లో ఒకటి. ఎందుకంటే ఒక వ్యక్తి తన కోసం కాకుండా ఇతరులను పొగుడుతూ ఉన్నాడంటే తన ప్రాధాన్యత లేదని తనకు తానే చెప్పుకుంటున్నట్లు అవుతుంది. అందువల్ల ఇది కూడా అష్ట కష్టాల్లో ఒకటి.

ఏడవది సేవకులు కరువవడం:

ప్రస్తుత కాలంలో చాలామంది కుటుంబ సభ్యులు కలిసి ఉండడం లేదు. కొందరు ధనవంతులు అయితే తమ సేవల కోసం పని మనుషులను నియమించుకుంటారు. కానీ డబ్బు లేకపోవడం వల్ల చాలామంది తమ పనులు తామే చేసుకుంటారు. వయసు పైబడిన వారు సైతం తమ పనులు తామే చేసుకోవాల్సి వస్తే అష్ట కష్టాల్లో ఒకదానిని ఎదుర్కొంటున్నట్లే.

ఎనిమిదవది వ్యాధి బారిన పడడం:

ఒక వ్యక్తి ఏదో వ్యాధితో ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు నయం కాదు. ఇలా బాధపడడం కూడా అష్ట కష్టాల్లో ఒకదాని ఎదుర్కొంటున్నట్లే.

ఇలా మొత్తం అష్ట కష్టాలను ప్రతి వ్యక్తి ఏదో ఒకదానిని ఎదుర్కొంటాడు. అయితే వీటిలో ఏ ఒక్కటి కూడా లేకుండా ఉండలేడు. కానీ దేవుళ్లకు పూజలు చేయడం లేదా మంచి పనులు చేయడం వల్ల కొన్నిటి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News