T20 World Cup 2024 విజయం తరువాత టిమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా మంది కుటుంబ సభ్యలుతో సమయం గడిపేస్తున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి హాయిగా ఉంటున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కుటుంబంతో కలిసి లండన్ లో షికార్లు కొడుతున్నాడు. భార్య భార్య అనుష్కతో పాటు కుమారుడు అకాయ్ తో షాపింగ్ చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. టీ 20 తరువాత జరిగిన టోర్నీలో విరాట్ కోహ్లి పాల్గొనలేదు. అయితే వచ్చే నెల రెండు నుంచి శ్రీలంకలో జరగబోయే వన్డే సీరిస్ ఉండనుంది. దీనికి కూడా కోహ్లీ దూరంగా ఉంటున్నట్టు సమాచారం. కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ లేదు. ప్రస్తుతం తన కుమారుడితో ఉన్న వీడియోపై క్రికెట్ అభిమానులు రకరకాల కామెంట్ చేస్తున్నారు.
Virat Kohli with his son Akaay in London.
— Tanuj Singh (@ImTanujSingh) July 18, 2024
– Cutest Video of the Day. ❤️pic.twitter.com/HwnRUmdbXZ