Wednesday, June 25, 2025

Viral Video: కేర్ టేకర్ కోసం ఆసుపత్రికి వచ్చిన ఏనుగు.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

మనుషులకు, మనుషులకు మధ్య ప్రేమ ఉంటుందో లేదో చెప్పేలేం.. కానీ మనుషులకు, జంతువులకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే కొందరు మనుషులతో స్నేహం చేసే బదులు జంతువులను పెంచుకుంటారు. విశ్వాసం తప్ప ఇంకేమి తెలియని వాటిపట్ల చూపిన ప్రేమను అవి తిరిగి ఇచ్చేస్తాయి. ఇలా తమపై ప్రేమ చూపిన వ్యక్తి ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఆందోళన చెందుతాయి. ఇలాగే ఓ ఎనుగు తన బాగోగులు చూసుకున్న ఓ కేర్ టేకర్ ఒక్కసారిగా కనిపించలేదు. దీంతో తీవ్రంగా మనో వేదన చెందింది. ఆ తరువాత ఏం జరిగిందంటే?

ఓ ఎనుగును ఎప్పటికీ తన కన్నబిడ్డల్లా చూసుకున్న కేర్ టేకర్ కు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తరువాత అతడు చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అయితే కొన్ని రోజులుగా కేర్ టేకర్ కనిపించకపోయేసరికి ఏనుగు మనో వేదన చెందింది. దీంతో వరుసగా అరుపులు చేయడంతో మరో కేర్ టేకర్ ఏనుగు బాధను అర్థం చేసుకున్నాడు. దీంతో ఆ ఏనుగును ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే వెంటనే తన కేర్ టేకర్ కోసం ఏనుగు ఆసుపత్రిలోపలికి వెళ్లింది. తొండంతో అతడిని పైకి లేపడానికి ప్రయత్నించింది.

ఇందుకు సంబంధించిన వీడియో Figen అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన వారు కన్నీళ్లు పెట్టుకోక మానడం లేదు. నేటి కాలంలో సొంత కొడుకులు తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. అలాంటి ఓ ఏనుగు తన కేర్ టేకర్ పై చూసిన ప్రేమను చూసి బావోద్వేగం చెందుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News