Tuesday, January 27, 2026

చెరుకు వ్యర్థాలతో అందమైన ప్లేట్లు.. ఎలా తయారు చేస్తున్నారో తెలుసా?

భారతదేశంలో హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా చెరుకు పండుతుంది. ఈ చెరుకు ద్వారా బెల్లం ను, పంచదారను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారు. అయితే చెరుకు ద్వారా వీటిని తయారుచేసిన తర్వాత బగాసే అనే పిప్పి మిగులుతుంది. దీనిని వృథాగా పడేసేవారు. అంతేకాకుండా దీనిని కాల్చడం వల్ల అత్యధిక మోతాదులో కార్బన్డయాక్సైడ్ రిలీజ్ అయ్యేది. కానీ ఉత్తర ప్రదేశ్ కు చెందిన Ved Krishna అనే యువకుడు చెరకు పిప్పి తో అందమైన ప్లేట్లను, కప్పులను తయారు చేస్తున్నాడు.CHUK అనే కంపెనీని తయారు చేసి అధికమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. అసలు ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? చెరకు పిప్పి తో ప్లేట్లను ఎలా తయారు చేస్తారు?

వీడియో కోసం.. కిందికి వెళ్లండి..

Ved Krishna తండ్రి జూన్ జూన్ వాలా ఒక వ్యాపారవేత్త. అతను చక్కెర మిల్లులను నడిపేవాడు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన తర్వాత అతడు యాష్ పక్క అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా చెరకు వ్యర్థాల నుంచి కాగితం తయారు చేయడం ప్రారంభించాడు. అంతేకాకుండా బొగ్గుకు బదులుగా బయోమాస్ ను ఉపయోగించే 8.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను స్థాపించాడు. అయితే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరగడంతో వ్యాపారం క్రమంగా బలహీన పడింది. ఇప్పటికే Ved కృష్ణ లండన్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయం నుంచి అడ్వెంచర్స్ స్టోర్స్ మేనేజ్మెంట్ చదివాడు. దీంతో తన తండ్రి వ్యాపారాన్ని నడిపించాలని అనుకున్నాడు.

అలా 1999లో యాష్ పక్క ను తన భుజాలపై వేసుకున్నాడు. అయితే ఈ కంపెనీని మరింత అభివృద్ధి చేయడానికి 85 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రతిపాదనతో బ్యాంకులను సంప్రదించగా వారు ఒప్పుకోలేదు. అయితే 2010 నుంచి ప్లాస్టిక్ ప్రమాదాల గురించి బాగా విన్న Ved Krishna ఆ తర్వాత చెరకు బగాసే నుంచి ఆహారానికి ఉపయోగించే ప్లేట్లను తయారు చేయాలని అనుకున్నాడు. దీంతో చైనా, తైవాన్ వంటి దేశాలను సందర్శించి.. అక్కడ చెరువు వ్యర్థాల నుంచి ఫైబర్ తయారు చేసే మిషన్లను కొనుగోలు చేశాడు.

2017లో కృష్ణ CHUK అనే కంపెనీని స్థాపించాడు. బయట ఉపయోగించే ప్లాస్టిక్, పేపర్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా చెరుకు వ్యర్థాల నుంచి ప్లేట్లను తయారు చేయడం ప్రారంభించాడు. చెరకు నుంచి బెల్లం, చక్కెర తయారైన తర్వాత మిలియన్ల కొద్దీ వ్యర్థం ఉంటుంది. దీనిని పూర్తిగా స్లాడ్జుగా మార్చి.. దీనిని ప్లేట్ల వలె తయారుచేస్తారు. వీటిని తయారు చేయడానికి ఎటువంటి కెమికల్స్ వాడకపోవడం విశేషం. వీటిని ఫ్రిజ్లో.. మైక్రో వేవ్ లో ముంచిన ఎటువంటి హాని కలగదు అని అంటున్నారు. ఈ విధానం వల్ల బయట ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వీటిని వాడుకోవచ్చని అంటున్నారు. Ved Krishna ప్రస్తుతం ప్రతిరోజు 3 టన్నులకు పైగా చెరుకు వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ యూనిట్ ప్రస్తుతం అయోధ్య, జైపూర్, జలంధర్ తో పాటు కేరళలో ఉంది. 1500 మంది ఈ కంపెనీల ద్వారా ఉపాధి పొందుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News