తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్ ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రెడీ చేసేందకు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా సెప్టెంబర్ 16న కేబినేట్ సబ్ కమిటీ మీటింగ్ జరిగిన అనంతరం వివరాలను మీడియాకు వెళ్లడించారు. కొత్త రేషన్ కార్డులను అందించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో కార్డులు ఎలా ఇస్తున్నారనే దానిపై అధ్యయనం చేసి ఆ తరువాత కార్యాచరణను రూపొందిస్తామన్నారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వం 49 వేల కార్డులు ఇచ్చింది. అయితే ఇప్పుడు అర్హుల జాబితాను తయారు చేసిన నిజమైన లబ్ధిదారులకు కొత్త కార్డులు అందజేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిసి తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా.. రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లు చేర్చుకునే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రాసెస్ కొత్త రేషన్ కార్డులు జారీ అయిన తరువాత ఉంటుందా? అంతకుముందే నిర్వహిస్తారా? అనేది తేలాల్సి ఉంది. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రజాపాలనలో 10 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహించే ప్రజాపాలనలో మళ్లీ దరఖాస్తులు చేయాలా? లేదా ఆ దరఖాస్తుల ఆధారంగా వివరాలు సేకరిస్తారా? అనే సందేహం నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.