జీవితంలో పెళ్లంటే అందరికీ సంబరమే. వందేళ్లపాటు గుర్తుంచుకునేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారు. బంధువులు, చుట్టాలు, స్నేహితులను పిలిచి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కొందరు పెళ్లిని ఒకేరోజులో రిజిస్టర్ ఆఫీసులో జరుపుకుంటుండగా.. మరికొందరు వారం రోజులపాటు హల్దీ, రిసెప్షన్ లాంటి కార్యక్రమాలతో వారం రోజుల పాటు ఆడంబరంగా నిర్వహించుకుంటున్నారు. అయితే పెళ్లికి సంబంధించి ఏ చిన్న విషయాన్ని అయినా వీడియోలో రూపంలో బంధిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి మండపం లో జరిగే కార్యక్రమాన్ని ప్రత్యేకమైన వీడియోగ్రాఫర్లు మాత్రమే కాకుండా.. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు సైతం తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తుంటారు. ఈ క్రమంలో ఓ పెళ్లి జరిగిన మండపంలో ఓ సంఘటన వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కింద పాపం పెళ్లికొడుకు.. అని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కామెంట్ ఎందుకు చేస్తున్నారో తెలుసా..?
సోషల్ మీడియా వచ్చిన తర్వాత వింత సంఘటనలు అన్ని బయటపడుతున్నాయి. ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఉండడం వల్ల ఏ చిన్న విషయాన్ని అయినా వీడియో తీసేస్తున్నారు. ఇక పెళ్లికొచ్చేసరికి ప్రతి చిన్న సంఘటనను వీడియోల రూపంలో బంధించాలని ఉత్సాహంగా ఉంటారు. ఇందులో భాగంగా ఓచోట పెళ్లి జరిగే కార్యక్రమాన్ని కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలో ఓ సీను చూసి నవ్వ లేకుండా ఉండిపోయారు.
వీడియో లో ఉన్న దాని ప్రకారం.. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అగ్నిగుండం చుట్టూ తిరిగేందుకు లేచి నిలబెడతాడు. పెళ్ళికూతురును తీసుకొని రెండు రౌండ్లు తిరుగుతాడు. మూడో రౌండ్ తిరిగేసరికి అతని లుంగీ ఊడిపోతుంది. ఇలా ఒక్కసారిగా పంచే ఊడిపోవడంతో అక్కడున్న వాళ్లంతా ఘొల్లున నవ్వారు. అయితే అప్పటికే కొందరు ఈ సంఘటనను వీడియో రూపంలో బంధించారు. ఆ తర్వాత దీనిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నవ్వలేని వారు అంటూ ఉండలేకపోతున్నారు. మరికొందరు మాత్రం ’పాపం పెళ్లి కొడుకు‘ అని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసి నవ్వుకోండి..