Tuesday, June 24, 2025

ఎండ నుంచి రక్షణకు.. ఈయన ఐడియా అదిరింది..

ఎండా కాలం రాగానే చాలా మంది బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. అయితే కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు తలపై కర్ చీప్ లేదా వాహనాలపై వెళ్లాల్సిన వారు హెల్మెట్ ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తే తల వరకు మాత్రమే రక్షణగా ఉంటుంది. కానీ శరీరంపై ఎండ తగిలి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఓ వ్యక్తి సైకిల్ పై వెళ్లేటప్పుడు ఎండ నుంచి రక్షణ పొందడానికి శరీరానికి ఏమాత్రం ఎండ తగలకుండా అదిరిపోయే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాహనాలపై వెళ్లే వారు హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. కానీ సైకిల్ పై వెళ్లేవారు మాత్రం హెల్మెట్ ధరించలేదు. తల వరకు మాత్రం ఏదైనా టవల్ కట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఓ వ్యక్తి సైకిల్ పై ప్రయాణించేటప్పుడు ఏమాత్రం ఎండ తగలకుండా కర్రలతో రక్షణ కంచెను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఓ గుడిసె మాదిరిగా ఉంది. దీనిపై వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది.

ఇది ఎండాకాలంలోనే కాకుండా వర్షాలకాలంలోనూ ఉపయోగపడేలా ఈ కప్పుపై టార్పాలిన్ కవర్ ను ఏర్పాటు చేశాడు. దీంతో ఎంత దూరం వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎండా, వానతో ఇబ్బంది ఉండదు. ఇక దీనిపై ఇద్దరు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఏర్పాటు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News