తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఇండియాలో కింగ్ మేకర్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఆయన నిర్ణయం కీలకంగా మారింది. దేశంలో బీజేపీ తరువాత అత్యధిక ఎంపీ సీట్లు గెలిచిన టీడీపీకి ఇప్పుడు నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో త్వరలో ఏర్పాటయ్యే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రత్యేకంగా నిలవనున్నారు. ఒక దశలో ఆయనకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు, మోదీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని మహబూబ్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనతో నే ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ తన పక్కన కూర్చోవాలని చంద్రబాబును ఆహ్వానించారు. అయితే బాబు మాత్రం పక్కన కాకుండా దూరంగా వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ మోదీ తన చేయి పట్టుకొని మరీ పట్టుబట్టి తీసుకొస్తారు. దీనికి సంబంధించిన వీడియో ఈటీవీ 3లో ప్రసారమైంది. అయితే దీనిని కాంగ్రెస్ నాయకులు పేస్బుక్ లో లేటేస్టు గా పోస్టు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోదీ, చంద్రబాబే ప్రధాన వ్యక్తులు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఎంత చనువు ఉందోనన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ వీడియో 2014 ఎన్నికల ప్రచారం నాటిది. పదేళ్ల నాటి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.