Tuesday, June 24, 2025

ఆసుపత్రికి రజనీకాంత్.. కారణం ఇదే..

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరోసారి ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోకి రజనీకాంత్ వచ్చారన్న సమాచారం తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. రజనీకాంత్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆసుపత్రిలో ఎందుకు చేరారు? అనే సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే వైద్యులు తెలుపుతున్న సమాచారం. ప్రకారం ఆయన గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు చేసుకునేందుకు ఆసుపత్రికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కడుపునొప్పి తీవ్రమవడంతో ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు మరికొందరు చెబుతున్నారు.

గతంలోనూ పలు మార్లు రజనీ ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో రజనీకాంత్ మెదడు రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడడంతో కావేరీ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆసుపత్రికి వచ్చి తిరిగి వెంటనే ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి నిత్యం రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. తాజాగా అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

అయితే గుండె పరీక్షల కోసం ఆసుపత్రికి రావాలని వైద్యులు చెప్పిన ప్రకారంగానే రజనీకాంత్ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ కు 73 ఏళ్లు. ఆయన కోసం వైద్యుడు సాయి సతీష్ ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హార్ట్ కు క్యాత్ ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే రజనీ హెల్త్ బులిటెన్ విడుదలయ్యే వరకు అందరిలో ఆందోళన నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News