తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణ మరణంతో రాష్ట్రంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అన్ని వర్గాల వారు ఆయనకు నివాళలర్పిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తనదైన శైలిలో పోరాటం చేసిన ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా భువనగిరి వాసులు జిట్టా బాలకృష్ణ ఇక లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలు, సేవల గురించి కొందరు చర్చించుకుంటున్నారు. జిట్టా బాలకృష్ణ తెలంగాణ ఉద్యమం కోసం చేసిన పోరాటాలు ఏంటంటే?
యాదాద్రి భువనగిరి జిల్లాలో 1972 డిసెంబర్ 14 న జన్మించారు. 1993లో ఎల్ బీ నగర్ నుంచి డీవీఎం డిగ్రీ పూర్తి చేసిన ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే 2009లో టీడీపీ నుంచి భువనగిరి టికెట్ పొందారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరినా పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో యువ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. 2014లో భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో బీజేపీ కూటమిలో భాగంగా పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు. 2022లో బీజేపీలో చేరిన ఆయన సస్పెన్సన్ కు గురయ్యారు. దీంతో 2023లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున ప్రచారం చేశారు.
పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసినా తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణ కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తరువాత ఆ పార్టీ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేశారు. అయితే టీఆర్ఎస్ నుంచి వివిధ పార్టీలో చేరిన ఆయన చివరకు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.