Thursday, February 6, 2025

‘అంత:పురం‘ పాటలో సౌందర్య చీర రంగులు మారడం వెనక మిస్టరీ ఇదే.. తేల్చేసిన కృష్ణవంశీ.. ఈ రెండు వీడియోలు చూశారా?

ఫ్యామిలీ చిత్రాలను తీయడంలో కృష్ణ వంశీ ముందుంటారు. ఆనాటి ‘సింధూరం’ నుంచి నేటి ‘రంగ మార్తాండ’ వరకు ఆయన సినిమాలో ఏదో విషయం ఉంటుంది. సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్ తో కూడిన కృష్టవంశీ సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఒకప్పుడు హీరో, హీరోయిన్ తో సంబంధం లేకుండా కృష్ణ వంశీ సినిమాలను ఎగబడి చూసేవారు. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన మూవీ ‘అంత:పురం’ ఒకటి. జగపతి బాబు, సాయికుమార్, సౌందర్య, ప్రకాశ్ రాజ్ లు కలిసి నటించిన ఈ మూవీ 1998లో థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాలో ‘అసలేం గుర్తుకు రాదు’ అనే సాంగ్ ను ఇప్పటికీ మరిచిపోరు. అయితే దీనిపై ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది.

1998లో కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘అంత:పురం’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో జగపతిబాబు, సాయికుమార్, ప్రకాశ్ రాజ్, ఆర్ పార్తిబన్, శారద, బాబుమోహన్, చిన్నా, తెలంగాణ శకుంతల వంటి వాళ్లు నటించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ కథ విషయానికొస్తే శేకర్ అనే వ్యక్తి న్యూజిలాండ్ లో ఉంటాడు. ఇక్కడే ఓ అమ్మాయి ప్రేమలో పడుతాడు. ఆ తరువాత వీరిద్దరు వివాహం చేసుకుంటారు. ీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. ఆ తరువాత వీరు తమ సొంతం ఊరికి వెళ్తారు. అయితే ఇక్కడ అనుకోని గొడవలో భర్త చనిపోతాడు. అయితే తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ అమ్మాయి తన కుమారుడిని తీసుకొని బయలు దేరుతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ల మీద ట్విస్టులు సాగుతూ ఉంటుంది.

ఇది వర్జినల్ సాంగ్..

ఇది ఎడిట్ చేసింది..

ఈ సినిమాలో అసలు కథ మొదలవకుముందే సాయికుమార్, సౌందర్యల ప్రేమ సీన్ సాగుతుంది. ఈ సందర్భంగా ఓ సాంగ్ వస్తుంది. అదే ‘అసలేం గుర్తుకు రాదు’ అనేది. ఈ పాట ఇప్పడు వచ్చినా పూర్తి కాకముందు ఛానల్ మార్చరు. అంతలా ఆకట్టుకుంది ఈ సాంగ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటను చిత్ర పాడారు. అందమైన గొంతుతో సాగే ఈ పాటను మొత్తం సముద్రంలో చిత్రీకరించారు.

అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే ఈ పాటలో సౌందర్య ఎర్రని రంగు చీరలో కనిపిస్తూ ఉంటుంది. సాయి కుమార్ కూమార్ పసుపు రంగు డ్రెస్సులో కనిపిస్తాడు. కానీ టీవీలో ఈ సినిమా పాట వచ్చినప్పుడు సౌందర్య చీర రంగులు మారుతూ ఉంటుంది. కానీ సినిమా థియేటర్లలో మాత్రం ఒకే రంగులో ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. అయితే ఓ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ వంశీ దీనిపై మాట్లాడారు. ఈ పాటలో సౌందర్య ఒకే చీరపై ఉంటుంది. కానీ జెమినీ టీవీ ఎడిటర్ దీనిని పూర్తిగా మార్చాడని డైరెక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News