Tuesday, June 24, 2025

ఇది ప్రశ్నా పత్రం కాదు.. పెళ్లి పత్రిక.. వినూత్న తరహాలో వెడ్డింగ్ కార్డు..

భారతీయ హిందూ వివాహ వ్యవస్థ రోజురోజుకు మారిపోతుంది. ఒకప్పుడు పెళ్లిని 5 రోజుల పాటు పెద్ద వేడుకలా నిర్వహించుకునేవారు. రాను రాను ఒక్కరోజులో పూర్తి చేస్తారు. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అందువల్ల ఈ పెళ్లిని ఘనంగా జరుపుకుంటారు. పెళ్లి దుస్తులు కొనే దగ్గర నుంచి మండపాల బుకింగ్ వరకు ప్రతీ ఒక్కటి కొత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే పెళ్లికి ఆహ్వానించడానికి పెళ్లి పత్రికలను అందిస్తూ ఉంటారు. ఈ పెళ్లి పత్రిక అందంగా, ఆకర్షణీయంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం ఎంత ధర వెచ్చించడానికైనా వెనుకాడరు. అయితే ఈ మధ్య విభిన్నతరహాలో పెళ్లి పత్రికలు ముద్రిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ జంట ఎవరూ ఊహించని విధంగా పెళ్లి పత్రికను ముద్రించారు. ఆ పెళ్లి పత్రిక ఎలా ఉందంటే?

పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు ప్రత్యూష పెళ్లి పత్రికను విభిన్నంగా ముద్రించాలని అనుకున్నారు. ఆమె ఆగస్టు 23న ఫణీంద్ర అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. అయితే ప్రత్యూష ఉపాధ్యాయురాలు. ఈ నేపథ్ంయలో ఆమె తన పళ్లి పత్రికను కొశ్చెన్ పేపర్ లా ఉండేలా తయారు చేయించారు. ఈ వెడ్డింగ్ కార్డులో మొత్తం 8 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఆన్సర్లు కూడా రాశారు. అంతేకాకుండా ఈ పత్రికపై వరుడి ఫొటో ఉంటుంది. ఇక వరుడి తల్లిదండ్రుల పేర్లు, కల్యాణ వేదిక తదితర వివరాలు కొశ్చెన్ పేపర్ లా తయారు చేయించారు. ఈ పత్రికను చూసిన కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News