ప్రతి కుటుంబంలో కొన్ని రకాల పదార్థాలను తయారు చేయడానికి బెల్లం తప్పనిసరిగా వాడుతారు. ప్రకృతి నుంచి లభించే సహజమైన పదార్థం బెల్లం. ఇది తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. చక్కెరకు బదులు బెల్లం తో చేసిన పదార్థాలను తినడం వల్ల షుగర్ కంటెంట్ను తక్కువ తీసుకోగలుగుతారు. అందువల్ల కొందరు టీ, కాఫీలల్లో షుగర్ కు బదులు బెల్లం వేసుకోవాలని అంటున్నారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క వస్తువు కల్తీమయం అయిపోతుంది. ఇందులో బెల్లం కూడా కల్తీగా మారే అవకాశాలు ఉన్నాయని కొందరు హెచ్చరిస్తున్నారు. బెల్లం నకిలీదో కాదో తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉపయోగించాలని food safety and standards authority of India(FSSAI) కొన్ని పరీక్షలు చేసి నకిలీ బెల్లం ను గుర్తించింది. దీనిని ఇంట్లో కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఆ వివరాల్లోకి వెళితే..
బెల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో దీనిని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. తీపి పదార్థాలు చేసుకోవడంలో బెల్లంను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ బెల్లంలో వాషింగ్ పౌడర్ కలిసే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇలా వాషింగ్ పౌడర్ ఉపయోగించిన బెల్లాన్ని తినడం వల్ల ప్రమాదకరమని కొందరు పేర్కొంటున్నారు. ఇలాంటి బెల్లం తినడం వల్ల ఎలర్జీలు లేదా కడుపులో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల కొనుగోలుదారులు బెల్లాన్ని తీసుకునేటప్పుడు బాగా పరిశీలించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలుపుతున్నారు.
అయితే బెల్లం నకిలీది అని అనుమానం వచ్చినప్పుడు కొన్ని రకాల పరీక్షలు చేయవచ్చని fssai తెలిపింది. ఇందు కోసం కొన్ని వస్తువులు అవసరమని పేర్కొంది. ఈ పరీక్ష కోసం..
ఒక పరీక్ష గొట్టాన్ని తీసుకోవాలి. రెండు గ్రాముల బెల్లం ముక్కను దగ్గర ఉంచుకోవాలి. ఒక మిల్లీమీటర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకోవాలి. పరీక్ష చేసే సమయంలో రక్షణ కోసం కళ్ళజోడును కూడా అందుబాటులో ఉంచుకోవాలి.
ముందుగా పరీక్ష గొట్టంలో బెల్లం ను రెండు గ్రాములు వేయాలి. ఆ తర్వాత ఒక మిల్లీలీటర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అందులో వేయాలి. ఇప్పుడు బుడగలు ఉండడం లేదా లేకపోవడం అనేది తెలుస్తుంది. కల్తీ చేసిన లేదా వాషింగ్ పౌడర్ కలిపిన బెల్లం బుడగలుగా వస్తుంది. స్వచ్ఛమైన బెల్లం ఎటువంటి బుడగలు రాకుండా ఉంటుంది.
ఇందుకు సంబంధించిన వీడియో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో ఉంచింది. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..