Sunday, February 2, 2025

అచ్చం కొరమీనులా ఉండే ఈ చేపలో క్యాన్సర్ కారకాలు.. తింటే అంతే సంగతులు..

మాంసాహారకృతుల్లో చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండి.. ఫ్యాటీ తక్కువగా ఉండడంతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని ఆరోగ్య శాస్త్రం చెబుతోంది. అయితే అన్ని రకాల చేపలు మంచివి కావని తెలుసుకోవాలి. వీటిలో క్యాట్ ఫిష్ గురించి ఇప్పటికే చాలామంది విన్నారు. ఈ చేపలు మేలు కంటే ఎక్కువగా నష్టాలన్నీ చేకూరుస్తుంది. దీనిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఇప్పుడు తాజాగా మరో ఫిష్ గురించి తెలుసుకోండి. ఈ ఫిష్ ను భారత దేశంలో బ్యాన్ చేశారు. ఇంతకీ ఆ చేప ఏదో తెలుసా..?

క్యాట్ ఫిష్ లాంటిదే మరో చేప.. మాగూర్ ఫిష్. ఇది విలక్షణమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ చేప ఎక్కడ ఉంటే అక్కడ మిగతా చేపలు మాయమవుతూ ఉంటాయి. అంటే వెజ్ కంటెంట్ కంటే ఎక్కువ మాంసాహారాన్ని మాత్రమే ఈ చేప తినడానికి ఇష్టపడుతుంది. శాస్త్రీయంగా గారి పీనస్ అనే పిలబడే మాగూర్ చేప గాలిని పీల్చుకోగలదు. ఇది పొడి నేలపై కూడా నడుస్తుంది. దీనిని బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు.

అయితే ఈ చేపలో విషపూరిత కారికాలు ఎక్కువగా ఉండడంతో 2000 సంవత్సరంలో దీనిని బ్యాన్ చేశారు. దీనికి ఆహారంగా కుళ్ళిన పదార్థాలు వేయడం వల్ల ఈ చేప లో ఫ్యాటీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శ్వాస కోసం ఇబ్బందులతో పాటు లివర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్ కు గురయ్యే వారు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల దీనిని నిషేధించారు. మరో విషయం ఏంటంటే భారతదేశంలో 70% చేపల తగ్గుతలకు మాగూర్ ఫిషే కారణమని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. దీంతో చేపల పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News